తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతూనే ఉంది. నెల రోజులు దాటినా సమస్య ఓ కొలిక్కిరాలేదు. ప్రభుత్వం సమ్మెను ఏమాత్రం లెక్క జేయడం లేదు. అటు కార్మికులు కూడా విలీనం అంశంపై అంతే పట్టుతో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి కేసీఆర్ పుండుపై కారం జల్లుతున్నారు.


ఏవైపు టీఎస్ ఆర్టీసీ సమ్మెతో ఇబ్బందులు పడుతుంటే.. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేశారు ఏపీ సీఎం జగన్. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం లో విలీనం చేసే  ప్రక్రియను  రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. జనవరి 1 నుంచి పబ్లిక్ టాన్స్ పోర్టు విభాగాన్ని ఏర్పాటు చేసి అందులో ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగులుగా గుర్తించే  ఏర్పాట్లు చేస్తోంది.


దీనికోసం  కార్మిక సంఘాలతో ఆర్టీసీ విలీన కమిటీ సచివాలయంలో సమావేశం నిర్వహించింది.  విలీనం ద్వారా కార్మికులకు  వర్తించే సౌకర్యాలు, సహా కమిటీ తీసుకురానున్న విధానాలపై కమిటీ సభ్యులు  చర్చించారు. గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ ,  నేషనల్ మజ్దార్ యూనియన్ , వైఎస్ ఆర్ ఆర్టీసీ మజ్దార్ కార్మిక సంఘం,రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు, తదితర సంఘాలు పాల్గొన్నాయి.


కార్మికులకు కావాల్సిన సౌకర్యాలను అన్ని కార్మిక సంఘాలు లేఖల ద్వారా  అభి ప్రాయాలుతెలియజేశారు.  ఆర్టీసీ ఉద్యోగులందరికీ  ఎన్ జి. వో ల తరహాలో ఓ పీ ఎస్ పెన్షన్  ను  ఇవ్వడం సహా మరో  26 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంప్లాయిస్ యూనియన్అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని సౌకర్యాలను కల్పించాలని ఎన్ ఎం యూ సహా వైఎస్ ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్  నేతలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: