కొంతమంది దంపతులు సంతానం కొరకు నోములు, పూజలు చేస్తారు. పెళ్లై చాలా సంవత్సరాలే అయినప్పటికీ పిల్లలు పుట్టకపోతే సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. సంతానం కోసం చాలా మూఢనమ్మకాలను కూడా నమ్ముతారు. పెళ్లైన దంపతులు పిల్లల్ని కనాలని చాలా తాపత్రయపడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ఆలయం దగ్గర ఉన్న కొండపై నిద్రిస్తే పిల్లలు ఖచ్చితంగా పుడతారని స్థానికులు చెబుతున్నారు. 
 
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం శ్రీరామదుర్గం కొండకు ఎంతో విశిష్టత ఉంది. ఒక పురాణ కథనం ప్రకారం శ్రీరామదుర్గం కొండ దగ్గర దశరథ మహారాజు త్రేతాయుగంలో పుత్రకామేష్టి యాగం తలపెట్టారని యాగ క్రతవులో లభించిన పాయసం వలన వారికి నలుగురు కుమారులు జన్మించారని తెలుస్తోంది. ఇక్కడి స్థానికులు అప్పటినుండి ఈ కొండపై నిద్రించిన వారికి సంతానం కలుతుందని చెబుతున్నారు. 
 
ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున ఈ కొండపై ఒక ఉత్సవం దర్శనమిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున వేల సంఖ్యలో దంపతులు సంతాన భాగ్యం కోసం కొండపైన ఉన్న ధర్మలింగేశ్వర స్వామి ఎదుట కార్తీక పౌర్ణమి నిద్ర చేస్తారు. మహిళలు నిష్టగా తలస్నానం చేసి కొండపై తడిబట్టలతో పడుకుంటారు. దేవుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అరటిపళ్లు, కొబ్బరికాయలు చేతిలో పట్టుకొని నిద్రపోతారు. 
 
అలా నిద్రించిన మహిళలకు కలలో పిల్లలు ఆడుకునే వస్తువులు ఏవైనా కనిపిస్తే సంతానయోగం కలుగుతుందని నమ్మకం. భక్తులు ఈ కొండను సంతాన కొండ అని పిలుస్తారు. కొందరు దంపతులు ఈ కొండపై నిద్రించిన తరువాతే తమకు సంతాన యోగం కలిగిందని చెబుతున్నారు. జన విజ్ఞాన వేదిక సభ్యులు మాత్రం ఈ నమ్మకం కేవలం మూఢ నమ్మకం అని చెబుతున్నారు. మొదట ఈ గుడికి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన భక్తులు మాత్రమే వచ్చేవారని ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం ఈ గుడిని సందర్శించటానికి వస్తున్నారని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: