తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మెపై ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఆయా ప‌క్షాలు ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నాయి. స‌మ్మెకు ముగింపు ప‌ల‌క‌డం స‌హా వివిధ అంశాల‌పై గులాబీ ద‌ళ‌ప‌తి తీరును ఎండ‌గ‌డుతున్నాయి. తాజాగా ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై క్యాబినెట్ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ బండా శివానందప్రసాద్ వాదనలు వినిపిస్తూ ప్ర‌భుత్వం వైఖ‌రిని వెల్ల‌డించిన విధానంపై...మ‌రోమారు ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తున్నాయి. తెలంగాణ: రాష్ట్రంలో ప్రైవేటు ఆపరేటర్లకు 5,100 బస్సు పర్మిట్లు ఇవ్వడానికి సంబంధించిన క్యాబినెట్ నిర్ణయ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని అడ్వకేట్ జనరల్ బండా శివానందప్రసాద్ హైకోర్టుకు వెల్లడించారు. ఈ మేరకు మంత్రివర్గం నిర్ణయానికి సంబంధించిన పత్రాలను సీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు అందజేశారు. జీవో లేదా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే క్యాబినెట్ నిర్ణయ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాతే క్యాబినెట్ నిర్ణయం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అప్పటివరకు క్యాబినెట్ సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయాన్ని పబ్లిక్ డొమైన్‌లో ఉంచాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. జీవో ఇచ్చిన తర్వాతే మంత్రిమండలి నిర్ణయాలు అమల్లోకి వస్తాయని తెలిపారు.


క్యాబినెట్ నిర్ణయాలను ప్రతిసారి వెల్లడించాల్సిన అవసరం లేదని.. వెల్లడించడం, వెల్లడించకపోవడం మంత్రిమండలి విచక్షణ మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమంకోసమే మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంటుందని, అలాంటి నిర్ణయాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి కదా? డాక్యుమెంట్ అందుబాటులో లేకపోతే ఎక్కువ అనుమానాలు వస్తాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై ఏజీ వాదనలు వినిపిస్తూ.. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8 (1)ను ఉదహరించారు. ఈ సెక్షన్ ప్రకారం క్యాబినెట్ పత్రాలు, వాదోపవాదాలు, చర్చించాల్సిన అంశాలు, అధికారులతో చర్చించిన అంశాలు బయటపెట్టాల్సిన అవసరంలేదని తెలిపారు. పత్రికల్లో వచ్చిన అంశాల ఆధారంగా పిటిషన్ వేశారని, క్యాబినెట్ నిర్ణయంలోని అసలు అర్థాన్ని పిటిషనర్ తప్పుగా అర్థం చేసుకున్నారని ఏజీ పేర్కొన్నారు. ఊహాజనిత అంశాల ద్వారా క్యాబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేయలేరని, కాజ్ ఆఫ్ యాక్షన్ లేకుండానే పిటిషన్ వేశారని తెలిపారు. క్యాబినెట్ నిర్ణయం వేరు.. వ్యాజ్యంలో పిటిషనర్ సవాల్‌చేసిన అంశాలు వేరని స్పష్టంచేశారు. ఈ దశలో క్యాబినెట్ నిర్ణయాన్ని చదువాలని ధర్మాసనం అడ్వకేట్ జనరల్‌ను కోరింది. అవి క్యాబినెట్‌కు సంబంధించిన ప్రత్యేక పత్రాలు (ప్రివిలేజ్ డాక్యుమెంట్లు) అని పేర్కొంటూ...ఓపెన్ కోర్టులో చదువడానికి ఏజీ విముఖత వ్యక్తం చేశారు.


మైక్‌లు ఆఫ్ చేస్తామని, తమ వద్దకు వచ్చి వివరించాలని ధర్మాసనం కోరడంతో.. వ్యక్తిగతంగా న్యాయమూర్తుల సమీపానికి వెళ్లిన ఏజీ, రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా క్యాబినెట్ పత్రాలపై న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇలా..ప్ర‌భుత్వం వైఖ‌రిని బ‌హిరంగంగా వెల్ల‌డించడం లేక‌పోవ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏంట‌ని...ఆర్టీసీ కార్మికులు, వారి ప‌క్షాన మ‌ద్ద‌తునిస్తున్న వారు స‌హ‌జంగానే...అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. హైకోర్టుకు మ‌స్కా కొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: