మ‌రో రైతు భూ సమస్య విష‌యంలో...రెవెన్యూ కార్యాల‌యంలో క‌ల‌క‌లం సృష్టించాడు. సంచిలో పెట్రోల్ బాటిల్‌తో వచ్చిన రైతు.. తన భూమికి పట్టా చేయకపోతే.. తన దగ్గరున్న పెట్రోల్‌తో అందరినీ తగులబెడ్తానని బెదిరించాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ను పరిష్కరించకపోతే పెట్రోల్‌పోసి తగులబెడతానంటూ ఓ రైతు రెవెన్యూ కార్యాలయంలో హల్‌చల్ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలాయపాలెం మండలంలోని బాలాజీనగర్ గ్రామపంచాయతీ శివారు రమణతండాకు చెందిన చందావత్ లాల్యా అనే రైతు గురువారం మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి తన 12 గుంటల భూమిని పట్టా చేయాలని అధికారులను కోరాడు. సంచిలో పెట్రోల్ బాటిల్‌తో వచ్చిన రైతు.. తన భూమికి పట్టా చేయకపోతే.. తన దగ్గరున్న పెట్రోల్‌తో అందరినీ తగులబెడ్తానని బెదిరించాడు. దీంతో, రెవెన్యూ సిబ్బంది వ‌ణికిపోయారు.


మ‌రోవైపు, త‌హ‌శీల్దార్ అనురాధాబాయి ఇచ్చిన ఫిర్యాదుమేరకు.. చందావత్ లాల్యాను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. జరిగిన ఘటనపై తాసిల్దార్‌ను వివరణ కోరగా లాల్యాకు వెదుళ్ల చెరువు రెవెన్యూలోని 109 సర్వేనంబర్‌లో 2.12 ఎకరాల భూమి ఉందని.. అందులో రెండెకరాలకు పట్టా పుస్తకం ఇచ్చామని తెలిపారు. మిగతా 12 గుంటలను అతను అమ్ముకున్నాడని.. అయినప్పటికీ ఆ 12 గుంటలకు పట్టా చేయాలని బెదిరిస్తున్నాడన్నారు. ఇందుకు సంబంధించి లాల్యా తమకు ఎలాంటి దరఖాస్తుచేయలేదని త‌హ‌శీల్దార్ పేర్కొన్నారు.  


మ‌రో ఎమ్మార్వో కార్యాల‌యంలో ఇదే త‌ర‌హా ఘ‌ట‌న చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి తహ‌శీల్ కార్యాలయం ఎదుట  తమ భూమిని పట్టాచేయాలని డిమాండ్‌చేస్తూ ఓ మహిళ తన కుమారులతో కలిసి బైఠాయించి ధర్నాకు దిగారు. మేడిపల్లి మండలం కమ్మరిపేటకు చెందిన పుప్పాల నడ్పి రాజం పేరిట సర్వే నంబర్లు 920లో 35 గుంటలు, 895లో 12.5 గుంటల భూమి ఉంది. పుప్పాల నడ్పి రాజం మృతి చెందడంతో ఈ భూమి మృతుడి భార్య గంగు పేరిట విరాసత్ చేయకుండా రెండేళ్ల‌ కింద అధికారులతో కలిసి పుప్పాల రాంరెడ్డి తన తండ్రి పుప్పాల చిన్న రాజం పేరిటచేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. ఈ భూమిపై 2018 ఆక్టోబర్ 22న కలెక్టర్, సబ్ కలెక్టర్, తాసిల్దార్‌కు ఫిర్యాదుచేసినట్టు గంగు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: