ఆర్టీసీ సమ్మె నేటికీ 42 వ రోజుకు చేరుకుంది.  ఆర్టీసీ కార్మికులు ఇన్నిరోజులపాటు సమ్మె చేసిన రోజులు లేవు.  ఇన్ని రోజులపాటు బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రజలు రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు.  42 రోజులపాటు బస్సులు తిరగకుంటే.. ప్రభుత్వానికి ఎంతమేర నష్టం వస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి అనే డిమాండ్ ను ఆర్టీసీ జేఏసీ నేతలు తాత్కాలికంగా వాయిదా వేసుకుని, మిగతా 26 డిమాండ్లపై పోరాటాన్ని ఉదృతం చేసేందుకు సిద్ధం అయ్యారు.  


పోరాటన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదని, పోరాటం చేసి తీరుతామని అంటున్నారు.  ఈరోజు నుంచి సమ్మెను ఉదృతం చేయబోతున్నారు.  5100 రూట్లకు ప్రైవేట్ బస్సులకు అనుమతి ఇచ్చే అంశంపై సోమవారం రోజున హైకోర్టులో విచారణ జరగబోతున్నది.  అటు ప్రభుత్వం కూడా దీనిపై నిన్నటి రోజున సుదీర్ఘమైన చర్చ చేయబోతున్నది.  సమ్మె విరమించని పక్షంలో 5100 రూట్లకు ప్రైవేట్ బస్సులను అనుమతి ఇవ్వాలని, సోమవారం హైకోర్టులో దీనిపై బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 


ఇదిలా ఉంటె, ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఆర్టీసీని రక్షించాలని అంటూ బైక్ ర్యాలీని చేయబోతున్నారు.  ఈనెల 16 వ తేదీన రిలే నిరాహార దీక్ష, 17,18 వ తేదీన  కార్మికుల సామూహిక దీక్ష, 19 వ తేదీన హైదరాబాద్ నుంచి కోదాడ వరకు సడక్ బంద్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు.  తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మెను విరమించే ప్రసక్తి లేదని మరోసారో జేఏసీ నేతలు స్పష్టం చేశారు. 


ఇకపోతే, తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా అప్పటి ప్రభుత్వం ఇంతమందిని అరెస్ట్ చేయలేదని, తెలంగాణ వచ్చిన తరువాత కెసిఆర్ ప్రభుత్వం ఇంతమందిని అరెస్ట్ చేయడం సరికాదని, అప్పటి ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా నిరంకుశంగా వ్యవహరించి ఉంటె తెలంగాణ వచ్చేదా అని ఆర్టీసీ జేఏసీ నేతలు విమర్శించారు. అరెస్ట్ చేసిన ఆర్టీసీ కార్మికులను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: