ఎన్నో టెలికాం సంస్థలు ఉన్నప్పటికీ ప్రజలను ఆకర్షిస్తున్న టెలికం సంస్థలు  కొన్ని మాత్రమే . అద్భుతమైన ఆఫర్లతో ప్రజలు అడుగడుగునా ఆకర్షిస్తూ లాభాల బాటలో నడిచిన  సంస్థలు చాలా తక్కువ. దేశంలోనే ప్రముఖ టెలికాం సంస్థల్లో వోడాఫోన్ ఐడియా ఒకటి. అయితే వోడాఫోన్ ఐడియా గత  రెండు మూడేళ్ల నుంచి నష్టాల బాటలో నడుస్తుంది. భారీ నష్టాలను మూటగట్టుకుంటు...క్లిష్ట  పరిస్థితుల్లో సంస్థ కొనసాగుతోంది. ఇప్పటికే నష్టాల బాటలో ఉన్న వోడాఫోన్ తో ఐడియా  అనుసంధానం అయిన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. వోడాఫోన్ కాస్త వొడాఫోన్ ఐడియా గా మారిన కూడా నష్టాలు తప్పడంలేదు ఈ  టెలికాం సంస్థకు . గతేడాదితో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ నష్టాన్ని చవిచూసింది. 

 

 

 దేశంలోనే ప్రముఖ టెలికాం రంగ సంస్థగా కొనసాగుతున్న వోడాఫోన్ ఐడియా సెప్టెంబర్ తో  ముగిసిన త్రైమాసికంలో భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. గత  ఏడాది ఈ సమయంలో 4,874 నాలుగు కోట్ల నష్టాన్ని చవిచూసిన వోడాఫోన్.... ఈసారి ఏకంగా 50,921 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. అదే సమయంలో ఆదాయం మాత్రం 42 శాతం పెరిగి 11,146  కోట్లుగా నమోదైంది . 

 

 

 

 అయితే వొడాఫోన్ ఐడియా సంస్థ కు పెరిగిన లాభాలతో పోలిస్తే నష్టాలు తక్కువే... అయినప్పటికీ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో భారీగా పెరిగిపోయాయి.అయితే ఈ విషయంలో ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడియా 44, 150 కోట్లు చెల్లించాల్సి ఉండడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఈ మొత్తాన్ని కలుపుకునే వోడాఫోన్ ఐడియా ఈ నష్టాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా సుప్రీం  ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది . ఇదిలా ఉండగా  ఇలాంటి కష్టాలు రావడం టెలికాం చరిత్రలోనే మొదటిసారి. ఇప్పటివరకు టెలికాం సంస్థల్లో ఏ  టెలికాం సంస్థ కూడా ఇంతటి స్థాయిలో నష్టం లేదు. అయితే భారీ నష్టాన్ని మూటగట్టుకున్న వోడాఫోన్ ఐడియా  టెలికాం సంస్థ వేయబోతున్న  రివ్యూ పిటిషన్ పై  సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించి వోడాఫోన్ ఐడియా సంస్థను  గట్టెక్కిస్తుందో లేదో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: