జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు. తనను ఓ కులానికి పరిమితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పవన్ నాయుడు అంటూ వైసీపీ నేతలు సంబోధించడాన్ని ఆక్షేపిస్తూ పవన్ కూడా జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ క్రైస్తవుడని.. కానీ క్రైస్తవంలో కులాలు ఉండవని ఆయన గుర్తు చేశారు.


మరి క్రైస్తవంలో కులాలు లేనప్పుడు జగన్ మోహన్ రెడ్డి పేరులో రెడ్డి ఎందుకని నిలదీశారు. తాను ఈ విషయాన్ని ఆయన విచక్షణకు వదలేస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. భాషాప్రయోక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో మాతృభాషకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవం తనను ఆవేదనకు గురి చేస్తోందని.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.


మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్న వైనాన్ని జగన్ చుట్టు ఉన్న మేథావులు సైతం ఖండించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధులకు సమకాలీన అంశాలపై పార్టీ పరమైన విధానాలను పవన్ వివరించారు.మంత్రి బొత్స తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను ఖండించారు. వ్యక్తిగత జీవితాల్లోకి ఎవరూ వెళ్లే ప్రయత్నం చేయరాదని.. పవన్ హితవు పలికారు. తనను పవన్‌నాయుడు అని వైకాపా సంబోధించడంపై జనసేన అధినేత స్పందిస్తూ.. నా పేరులో లేనిది నాకు ఆపాదించడం ఆపాలన్నారు. ఏ కులంలో, ఏ మతంలో పుట్టాలనే అవకాశం మన చేతుల్లో లేదన్న పవన్ ... కానీ  ఎలా ప్రవర్తించాలో మన చేతుల్లోనే ఉంటుందని అన్నారు.


సీఎంను జగన్ రెడ్డి అని పిలిస్తే కోపం వస్తుంది కాబట్టి.. ఎలా పిలవాలో వైకాపా ఎమ్మెల్యేలంతా తీర్మానించుకుని చెప్పండి.. మీరు ఎలా పిలవమంటే అలానే పిలుస్తా అన్నారు పవన్. తెలుగుభాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారని ఉద్దేశపూర్వకంగానే అన్నానని పవన్ గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: