పవన్ కళ్యాణ్ ఎన్నికల నాలుగు నెలల ముందు చంద్రబాబు మీద .. టీడీపీ మీద తెగ విరుచుకుపడ్డారు. తరువాత ఎన్నికలు అయిపోయిన తరువాత ఇద్దరు కలిసి పోయి ధర్నాల్లో పాల్గొంటారు. పవన్ మీద విమర్సలు చేస్తే చంద్రబాబు తట్టుకోలేరు. మరీ 2019ఎన్నికల ముందు టీడీపీ పార్టీ అవినీతిమయిందని చెప్పిన పవన్ మేధావి ఇప్పుడు ఎందుకు టీడీపీతో కలిసి పోయారు. పైగా వైసీపీ నాయకులూ పవన్ ను దత్త పుత్రుడు అంటే అసలు తట్టుకోలేరు. కానీ చంద్రబాబు డైరెక్షన్లో పని చేస్తారు. ఒక అధి నేత.. మరో పార్టీ అధినేత ను ఉద్దేశించి చేసిన విమర్శల కు.. ఈ రెండు పార్టీల కు సంబంధం లేని ఇంకో పార్టీ అధినేత ఆవేదన వ్యక్తం చేయటం ఎక్కడైనా చూశారా? పవన్.. బాబు ల మధ్య బంధం బలమైనదని.. చంద్రబాబు కు పవన్ దత్త పుత్రుడనే మాటను నిజం చేసేలా తాజాగా టీడీపీ అధినేత మాటలు ఉండటం ఇప్పుడు ఆసక్తికరం గా మారింది.


పవన్ మీద చేసిన విమర్శలకు బాబు గారికి చాలా కోపం వచ్చింది. ఐసుక కొరత అంశాన్ని రాజకీయం చేసేందుకు.. మైలేజీ కోసం కిందా మీదా పడుతున్న చంద్రబాబు.. తాజాగా బెజవాడ లో ఇసుక కొరత పేరు తో దీక్ష చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టి.. ఘాటు విమర్శలు చేసిన ఆయన..విచిత్రం గా జనసేన అధినేత పై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శల్ని ప్రస్తావించటం విశేషం.కుటుంబ సభ్యుడి నో.. పార్టీ నేతనో విమర్శిస్తే కూడా ఇంతలా రియాక్ట్ కారేమో?


అయితే పవన్  చంద్రబాబు మధ్య ఉన్న బంధం అలా మాట్లాడిస్తుంది. పవన్ మీద జగన్ చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు తప్పు పట్టటం ద్వారా జనసేన అధినేత తన దత్త పుత్రుడన్న భావన ను మరింత బలపడే లా చేశారని చెప్పాలి. పవన్ కల్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేయటాన్ని చంద్రబాబు తప్పు పట్టటమేకాదు.. మీపైనా..మీ కుటుంబం మీదా వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకో గలరా? అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ప్రశ్నించారు. తమ పార్టీ కి ఏ మాత్రం సంబంధం లేని పవన్ ను ఏపీ సీఎం విమర్శిస్తే..బాబు కు అంత బాధ ఏమిటన్నది ప్రశ్న గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: