ఈ మధ్యన కుక్కలను పెంచుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే కుక్కలను పెంచుకునే ఇప్పుడు ఒక పెద్ద ట్రెండ్  అయిపోయింది. ప్రేమతో కుక్కలను పెంచుకునే వాళ్ళకంటే... ట్రెండ్  కోసం కుక్కలను పెంచుకుంటున్న  వాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక కుక్కలను పెంచుకుంటున్న వారు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇదిలా ఉంటే కుక్క తోక వంకర అనే సామెత అందరూ ఎరిగిందే . అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. కుక్క తోక ని ఎంత చక్కగా చేసినా కూడా అది మళ్ళీ ఒకరగానే  మారిపోతుంది. 

 

 

 

 అయితే కుక్క తోక వెనకాల ఉంటుందా ముందు ఉంటుందా.? అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు. ఇదో ప్రశ్న అని మనసులో ఫీలై...  వెనకాలే ఉంటుందని టక్కున సమాధానం చెప్పేస్తారు. కానీ ఈ కుక్క విషయంలో మాత్రం మీరు చెప్పిన సమాధానం తప్పే అవుతుంది. ఎందుకంటే ఈ కుక్క తోక వెనకాల కాదు ముందు ఉంది. కుక్క తోక ముందు ఉండడం ఏంటి అని ఆశ్చర్యపోయిన... ఇది నిజమే. మామూలుగా అయితే కుక్కలు అన్నింటికీ తోకలు వెనకాలే ఉంటాయి కానీ ఈ కుక్కకు  మాత్రం రెండు కాళ్ళ మధ్యలో నుదుటి మీద తోక ఉంది. ప్రస్తుతం ఈ శునకం  అందరిని ఆకర్షిస్తుంది. 

 

 

 

 అంతే కాదు ఇప్పుడు ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ ఐపోతుంది. ఈ కుక్కకు తోక నెత్తిపై ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ  ఈ శునకం  కేరాఫ్ అడ్రస్ ఎక్కడో తెలుసా అమెరికాలోని మిసోరి లో . ఈ శునకం నెత్తి మీద  రెండు కళ్ళ మధ్య ఉన్నది  తోక. ప్రస్తుతం ఈ శునకం అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. అయితే ప్రత్యేక అవసరాల తో బాధపడే జంతువులను సంరక్షించే మ్యాక్స్ మిషిన్ శునకాని చేరదీసింది. అంతే కాదండోయ్ ఈ శునకానికి  నార్వల్ అనే పేరు కూడా పెట్టి సంరక్షిస్తుంది. అయితే తాజాగా ఈ ఫోటోని కాస్త సోషల్ మీడియాలో పెట్టడంతో అది విపరీతంగా వైరల్ అవుతుంది నెటిజన్లు అందరినీ ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: