అసలే సమస్యలతో సతమతమవుతున్న చంద్రబాబునాయుడుకు కొత్తగా మరో తలనొప్పి మొదలైంది.  గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ రూపంలో మొదలైన ఈ సమస్యను ఎలా డీల్ చేయాలో అర్ధంకాక ఇపుడు తల పట్టుకుంటున్నారు. టిడిపిలోనే ఉంటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతు ఇస్తానని వంశీ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.  

 

ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష చేస్తున్న సందర్భంలోనే వంశీ మీడియా సమావేశంపెట్టి తన అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటించటం పార్టీలో సంచలనంగా మారింది. ఎంఎల్ఏది ఒక విధంగా చంద్రబాబుపై తిరుగుబాటు అనే చెప్పుకోవాలి. ఇంత బాహాటంగా చంద్రబాబుపై ఓ ఎంఎల్ఏ తిరుగుబాటు చేస్తారని ఎవరూ ఊహించలేదు. నిజానికి ఇటువంటి సమస్య తనకు ఎదురవుతుందని చంద్రబాబు కూడా ఊహించుండరు.

 

ఎప్పుడైతే వంశీ ప్రకటన దీక్షలో ఉన్న చంద్రబాబుకు చేరిందో వెంటనే ఆయన పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. చివరగా మాట్లాడినపుడు జగన్ పై తన ఆక్రోసాన్ని వెళ్ళగక్కటంలోనే వంశీ ప్రకటన  ఎంతగా డిస్ట్రబ్ చేసిందో  చంద్రబాబు మొహం చూస్తేనే అర్ధమైపోయింది. పైగా గడచిన ఐదునెలలుగా జగన్ ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలు, విమర్శలను పాయింట్ పాయింట్ గా ప్రస్తావిస్తు ఎంఎల్ఏ తప్పుపట్టటాన్ని చంద్రబాబు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

నిజానికి వంశీ లేవనెత్తిన అంశాల్లో తప్పుకూడా ఏమీ లేదు. ఎంఎల్ఏ అభిప్రాయాలతో ఏకీభవించే సీనియర్ నేతలు పార్టీలో చాలామందే ఉన్నారు. వాళ్ళల్లో కొందరు వంశీ అభిప్రాయాలనే చంద్రబాబుకు ఇదివరకే చెప్పారు కూడా.  కానీ చంద్రబాబే పట్టించుకోలేదు. తనను చావుదెబ్బ కొట్టి జగన్ సిఎం అవటాన్ని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తట్టుకోలేకపోతున్నారు.

 

దానికి ఆజ్యం పోయటానికి ఎలాగూ ఎల్లోమీడియా ఉంది కదా ? అందుకనే జగన్ సిఎం అయిన నెల రోజులకే ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. దాన్నే వంశీ తప్పుపడుతున్నారు. సరే మిగిలిన విషయాలు ఎలాగున్నా ఇపుడు వంశీని డీల్ చేయటమెలాగన్న ప్రశ్న చంద్రబాబును ఇబ్బంది పెడుతోంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు గన్నవరం ఎంఎల్ఏని కంట్రోల్ చేయలేకపోతే భవిష్యత్తులో ఇంకెంతమంది ఎదురు తిరుగుతారో అర్ధంకాక టెన్షన్ పెరిగిపోతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: