టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏం కావాలి అన్నాసరే ఇంట్లోనే కూర్చొని చిటికెలో తెప్పించుకోవచ్చు.  క్లిక్ చేస్తే చాలు.. చేతిలోకి డబ్బులు వచ్చిపడతాయి.  అన్ని వస్తువులు ఇంటికి తెప్పించుకొని వాడుకోవచ్చు.  ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.  ప్రజల సౌకర్యార్థం అమెజాన్ సంస్థ ఎన్నో ఉత్పత్తులను చిన్న క్లిక్ తో ఇంటికి చేరుస్తున్నది.  గుండుసూది నుంచి ప్రతి వస్తువు అమెజాన్ లో లభిస్తుంది.

ఇదిలా ఉంటె, అమెజాన్ సంస్థ ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి ఓ వస్తువును తీసుకొచ్చింది.  అది వినడానికి విడ్డూరంగా ఉండటంతో పాటు విమర్శలకు తావునిస్తోంది.  మొదటి రాత్రి కన్యత్వాన్ని నిరూపించుకోవడానికి మహిళలు తాపత్రయ పడుతుంటారు.  ఎందుకంటే, మొదటిరాత్రిపై మగవాళ్లకు అనేక ఆలోచనలు ఉంటాయి.  మొదటిరాత్రి రోజున కన్యకు బ్లడ్ వస్తేనే కన్యత్వం ఉన్నట్టు అనే నానుడి ఉన్నది.  


ఇది తరతరాలుగా ఇలాంటి ఆలోచనలతోనే ప్రజలు జీవిస్తున్నారు.  ఈ రాకెట్ యుగంలో కూడా మొదటిరాత్రిపై ఇలాంటి మూఢనమ్మకాలు ఉండటంతో అమెజాన్ వంటి సంస్థలకు ఇది ఒక వరంగా మారింది.  దీనిని క్యాష్ చేసుకోవాలని సదరు సంస్థలు చూస్తున్నాయి.  మొదటిరాత్రి కన్యత్వం నుంచి రక్తం రావాలంటే  తమ వస్తువును వాడాలని, ఆ వస్తువును వాడితే, మొదటి రాత్రి తప్పకుండా బ్లడ్ వస్తుందని చెప్తోంది.  


మనుషుల ఆలోచనలను బట్టి  ఇలాంటి సంస్థలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.  సంస్థలు తయారు చేసే వస్తువులను బట్టే అమ్మకాలు ఉంటున్నాయి.  గతంలో ఆవుపేడతో చేసిన పీడలకను కూడా అమెజాన్ సంస్థ అమ్మింది.  ఆవుపేడ హిందువులకు పూజ్యనీయం కాబట్టి దీనిని ఆ సంస్థ క్యాష్ చేసుకుంది.  ఇప్పుడు మనుషుల మనోభావాలను క్యాష్ గా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నది అమెజాన్ సంస్థ.  ఆమధ్య కాలంలో హిందూ దేవుళ్ళ ఫొటోలతో కూడిన వస్తువులు తయారు చేసి చివాట్లు తిన్న సంగతి కూడా తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: