రేషన్ కార్డు అంటే అతడు అధికారికంగా పేదవాడు అయిపోయినట్లే. నాలుగు అంతస్తుల భవనంలో ఉన్న రేషన్ కార్డు ఉంటే చాలు అతను చౌక బియ్యానికి అర్హుడైపోతున్నాడు. ఇదంతా 2012 సమయంలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యామంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టైంలో వచ్చినది. రచ్చబండకు దరఖాస్తు చేసుకున్న వారికి చేసుకున్నట్లుగానే తెల్ల కార్డు అప్పట్లో ఇచ్చేశారు.


ఆ తరువాత వచ్చిన చంద్రబాబు సైతం అనర్హత జోలికి పోకుండా కొత్తగా కోరిన వారికల్లా కార్డులు ఇచ్చేశారు. దాంతో ఏపీలో కోటిన్నరకు పైగా కుటుంబాలు ఉంటే దాదాపు కోటింపావు కుటుంబాలు  తెల్ల కార్డుని పొంది ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రంలో పెదవాళ్ళే ఎక్కువగా ఉన్నారన్న మాట. మరి ఇలా కార్డులు తీసుకున్న వారిలో సంపన్నులు, కారు ఉన్న వారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు, వ్యాపారులు అనేకమంది కూడా ఉన్నారు.


మరి వీరికి కనుక రేషన్ ఇస్తే ఏపీ ఖజానా అసలు ఎక్కడా  సరిపోదు. బాబు ఓట్ల రాజకీయం కోసం దీన్ని అసలు ముట్టుకోలేదని అంటారు. దాంతో ఇపుడు జగన్ సర్కార్ రంగంలోకి దిగి అసలు వారు ఎవరు, కొసరు వారు ఎవరు అన్న లెక్కలు తేల్చ‌నుందని అంటున్నారు. అదే విధంగా రేషన్ కార్డు ఉండాలంటే ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు, ప్రభుత్వం ఫ్యామిలీ పించను తీసుకున్న వారు కూడా అర్హులు కారు అని కూడా కండిషన్లు పెట్టింది. ఇంకా పెదవాడు అనడానికి కొన్ని మార్గదర్శకాలు పెట్టింది.


వాటి ప్రకారం గ్రామ వాలంటీర్లు ఇళ్ళకు వెళ్ళి మరీ లబ్దిదారుల వివరాలు తీసుకుంటారు. అర్హుల కార్డులనే ఉంచుతారు. ప్రభుత్వ‌లెక్కల ప్రకారం  ఏపీలో 80 లక్షలకు పేద కుటుంబాలు మించకపోవచ్చునని అంటున్నారు. అంటే యాభై లక్షల కుటుంబాలకు కార్డులు ఇకపై  ఉండవన్న మాట. వారంతా ధనవంతులు కాబట్టి. ఇదిలా ఉండగా నాలుగు విభాగాలుగా చేసి కార్డులని వైసీపీ సర్కార్ ఇకపై అందిస్తోంది. అందులో బియ్యం కార్డు, ఆరొగ్యశ్రీ కార్డు, పించను కార్డు.అ ఫీజు రీ అంబర్స్మెంట్ కి మరో కార్డు ఇస్తారట. దీనివల్ల ఎవరికి ఏ అవసరం వస్తే ఆ కార్డు చూపిస్తే ఉచితం అన్నది అందుతుంది.  ఈ నెల 20 నుంచి  గ్రామ సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు అర్హులను ఎంపిక చేసి ఎ కార్డులను జారీ చేస్తారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: