ఇసుక కొరత పేరుతో దీక్ష చేసిన చంద్రబాబునాయుడుకు తృప్తి తీరిపోయినట్లే కనిపిస్తోంది.  ఇంతకీ చంద్రబాబుకు తీరిన తృప్తి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోయటమే. నోటికొచ్చినట్లు తిట్టటం, ఇతరులతో తిట్టించటం. జగన్ ను తిట్టటమంటే చంద్రబాబుకు మొదటి నుండి మహా సరదా. కాబట్టి మీడియా సమావేశాల్లో ఆ తీట తీర్చేసుకుంటునే ఉన్నారు. కాకపోతే ఇతరులతో కూడా తిట్టించటమే కొత్త ట్రెండ్.

 

రాష్ట్రంలో వరదలు, వర్షాల ప్రభావం తగ్గిపోయిన తర్వాత గడచిన రెండు వారాలుగా వివిధ రీచ్ ల నుండి కావాల్సినంత ఇసుక సరఫరా అవుతోంది. రోజుకు సుమారు 1.6 లక్షల టన్నుల ఇసుకను తవ్వి స్టాక్ పాయింట్లకు తరలిస్తున్నారు. స్టాక్ పాయింట్ల నుండి వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు. ఈ మొత్తాన్ని రోజుకు 2 లక్షల టన్నులకు పెంచాలని జగన్ ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే.

 

ఇసుక కొరత తీరిపోయిన తర్వాత చంద్రబాబు దీక్ష చేయటమే విచిత్రంగా ఉంది. పైగా ఆ దీక్షకు ప్రతిపక్షాల నేతలందరూ రావాలని చాలా హడావుడి చేశారు. అయితే చంద్రబాబు ఎంత ప్రయత్నించినా ప్రతిపక్ష నేతలెవరు దీక్షకు హాజరుకాలేదు. చివరకు ఆయన దత్తపుత్రుడని వైసిపి ఆరోపిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా హ్యాండిచ్చారు.

 

సరే ఎవరొచ్చినా రాకపోయినా చంద్రబాబు మాత్రం దీక్ష ముగింపు సందర్భంగా దాదాపు రెండుగంటల పాటు మాట్లాడారు. మాట్లాడారంటే జగన్ ను తిట్టటం, ఆరోపణలు చేయటం, విమర్శించటమే. ఆయన విషయంలో కొత్తేమీ లేదనుకున్నా పార్టీలోని మరి కొందరితో కూడా మాట్లాడించారు.

 

భవన నిర్మాణ కార్మికుల ముసుగులో పార్టీలోని వారితోనే జగన్ ను తిట్టించారు. అవకాశం దొరికింది కదాని వాళ్ళు కూడా రెచ్చిపోయి జగన్ ను నోటికొచ్చినట్లు తిట్టేశారు. మొత్తం మీద తాను తిట్టటమే కాకుండా మరికొందరితో కూడా జగన్ ను బాగా తిట్టించి చంద్రబాబు తన అహాన్ని లేదా  తృప్తిని తీర్చుకున్నట్లే కనిపిస్తోంది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: