అనుమానం పెనుభూతం అంటారు. నిజానిజాలు ఆలోచించకుండా వేసే నిందలవల్ల ఒక్కోసారి ఎన్ని అనర్ధాలు జరుగుతాయంటే ప్రాణాలు కూడ పోతాయి. మంచి బందాలు కూడా నవ్వుల పాలవుతాయి. ఒక మనిషికి ఉండవలసిన లక్షణం వివేకం అదే లేకుంటే సమాజంలో అతను బ్రతికి ఉన్న లెక్కలో లేని వాని కిందే లెక్క. ఇక ఇలాంటి అనుమానాలను మనిషి అవసరాల కోసం సృష్టించుకున్న టెక్నాలజీ మనసులోకి చొరబడి కలుషితం చేస్తుంది.


ఆనందంగా సాగే మనిషి బ్రతుకులోకి అతిధిలా వచ్చి తానే సర్వం ఐంది. ఇప్పుడు సెల్ లేని మనిషి లేడంటే నమ్మలేని పరిస్దితి. కాని ఈ సెల్ వల్ల ఉన్న ఉపయోగాలకంటే అనర్ధాలే ఎక్కువ జరుగుతున్నాయి. మానవుల సంతోషాన్ని దొంగలా దోచుకెళ్లుతున్న ఈ ఫోన్‌ల వల్ల ఇప్పుడొక అమాయకురాలు బలైంది. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి కానరాని లోకాలకు తీసుకెళ్లింది. ఇక ఈ దారుణం జరిగింది కుమురం భీం జిల్లా జైనూరు మండలం కొండిబగూడ గ్రామంలో.


బాధితురాలి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం. కొండిబగూడకు చెందిన రమాకాంత్ కు జైనూరు మండల కేంద్రంలోని శివాజీనగర్ కు చెందిన సోన్ కాంబ్లె సీతాల్ (24)తో నాలుగేళ్ల కిందట  వివాహం జరిగింది. కూలీనాలీ చేస్తూ అన్యోన్యంగా కొనసాగుతున్న దంపతుల జీవితంలోకి, బొడికే అనికేతన్ అనే యువకుడి ఫోన్ కాల్ చిచ్చురేపింది. ఇతను తరచుగా సీతాల్ కు ఫోన్  చేసి వేధిస్తోండడంతో విసుగుచెందిన ఆమె అతణ్ని ఫోన్లోనే నిలదీసింది.


దీంతో మనసులో ఆమెపై పగను పెంచుకున్న యువకుడు ఆమె భర్తకు సీతాల్ గురించి లేనిపోని మాటలు కల్పించి అతన్ని నమ్మించాడు. ఈ క్రమంలో వారిద్దరి మద్య పెద్ద గొడవ జరిగింది. తనపై అకారణంగా నిందలు వేయడమే కాక ఫోన్  చేసి మాటి మాటికి వేధిస్తున్న యువకుడి వేధింపులు భరించలేక మనస్దాపానికి గురైన సీతాల్  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది..


ఈ విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను హుటాహుటిన  ఆదిలాబాద్  రిమ్స్ హస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున సీతాల్ మరణించింది. ఇకపోతే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాపు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపతి పేర్కొన్నారు..  చూసారా నిజానిజాలు తెలుసుకోకుండా  ప్రవర్తించిన భర్త,  కామంతో కన్నేసిన నీచుడివల్ల ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటనకు బాధ్యులైన వారికి ఎటువంటి శిక్ష విధించిన పోయిన ప్రాణం తిరిగి రాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: