ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా అన్ని చెక్ చేసుకొని వెళ్ళాలి.  ఒకటికి నాలుగుకు పదిసార్లు చెక్ చేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉన్నది.  అలా లేకుంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  ఎందుకంటే.. ఇంట్లో ఏదైనా తెలుపు తీసి ఉంటె దాని ద్వారా లోపలికి ఏదైనా రావొచ్చు.. ఏదైనా చెయ్యొచ్చు.  ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేరు.  


అందుకే మనవాళ్ళు బయటకు వెళ్లే సమయంలో ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని వెళ్తుంటారు.  అన్ని మూసి ఉన్నాయా లేదా.. లేదంటే ఏదైనా తేడా ఉన్నదా.. ఉంటె ఏంటి పరిస్థితి అని ఒకటికి పదిసార్లు అలోచించి నిర్ణయం తీసుకుంటారు.  ఇంటికి తాళాలను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని బయటకు వెళ్లారు.  పైగా ఇప్పుడు తాళం వేసిన ఇంటికి దొంగలు పడుతున్నారు.  అది మరీ దారుణమైన విషయం అని చెప్పాలి.  


అయితే, డెహ్రాడూన్ లో ఓ ఫ్యామిలీ కొన్ని రోజుల క్రితం పనిమీద ఊరు వెళ్లారు.  తీరా ఇంటికి వచ్చి తాళాలు ఓపెన్ చేసి బెడ్ రూమ్ లో నుంచి ఏవేవో సౌండ్స్ రాయడంతో ఆ ఫ్యామిలీ షాక్ అయ్యింది.  లోపల ఏమున్నదో తెలుసుకోవడానికి రూమ్ తాళం ఓపెన్ చేసి తొంగి చూశారు.  బెడ్ రూంలో లోపల ఓ మూలన చిరుత నక్కి ఉన్నది.  లోపల ఉన్న చిరుతను చూసి షాక్ అయ్యారు.  


రోజుల తరబడి లోపలే ఉన్నట్టుంది.  ఆకలితో నకనకలాడుతున్నది.  హఠాత్తుగా లోపలికి వెళ్తే మరోలా ఉండేది.  కానీ, అరుపులు విని తొంగి చూసిన ఫ్యామిలీ తలుపుకు లాక్ చేసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.  సమాచారం అందుకున్న అటవీశాఖ నాలుగురు గంటలపాటు కష్టపడి ఆ చిరుతను పట్టుకున్నారు.  తలుపు చిన్నదిగా ఉండటంతో... గోడను బ్రేక్ చేసి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.  వంటగది ఓపెన్ చేసి ఉండటంతో అటు నుంచి లోపలి చిరుత వచ్చినట్టుగా తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: