ఎంత కాదనుకున్నా ఏపీ రాజకీయాల్లో కులం రాజ్యమేలుతోందని అంతా అంటారు. ఇక ఒక నాయకుడు తన కులం మీదనే ఎక్కువగా ఆధారపడి రాజకీయం చేయడం కూడా ఇక్కడే చూస్తూంటాం. ఇక పార్టీలు ఉన్నా కూడా వాటిలో కూడా ఆయా కులాధిపతుల నేతల డామినేషన్ కొట్టిపారేయ‌దగ్గది కాదు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో సైతం ఏపీ వరకూ వచ్చేసరిగి ఒక సామాజికవర్గం ఆధిపత్యం ఉండేది.


ఇక బీజేపీలో కూడా ఒక సామాజికవర్గం ఆధిపత్యం ఇటీవల కాలంలో పెరిగిపోతోందని పాత కాపులు గగ్గోలు పెడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా కమ్మ సామాజికవర్గం అండగా ఉంటోంది. ఆ మాటకు వస్తే టీడీపీ ఏర్పాటు వెనక కమ్మలకు కాంగ్రెస్ లో నిరాదరణ ప్రధాన కారణంగా చెబుతారు. అక్కడ రెడ్డి రాజ్యాన్ని తట్టుకోలేక  ముఖ్యమంత్రి పదవి దక్కక ఇబ్బంది పడ్డ నాదెండ్ల భాస్కరరావు వంటి వారు పార్టీ పెట్టాలనుకుని ఎన్టీయార్ తో చేతులు కలిపారన్నది చరిత్ర.


ఇక తెలుగుదేశంలో ఎన్టీయార్ ఉన్నపుడు ఈ కుల జాడ్యం ఎక్కువగా లేదని కూడా అంటారు. చంద్రబాబు సైతం తొలినాళ్లలో ముఖ్యమంత్రి అయ్యాక తన సొంత సామాజికవర్గాన్ని దూరంగా ఉంచారని చెబుతారు. తరువాత అంటే రెండు మార్లు ఓడిపోయాక 2014 నాటికి కమ్మలను పూర్తిగా నమ్మే స్థితికి బాబు వచ్చేశారని అంటారు. ఫలితంగా గత అయిదేళ్ళ టీడీపీ పాలనలో కుల ముద్ర బాగా పడిపోయింది. ఇవన్నీ ఇలా ఉంచితే ఇపుడు టీడీపీ నుంచి కమ్మ నాయకులే వరసగా బయటకు వెళ్ళిపోతూండడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కమ్మలు టీడీపీని వీడడం అంటే అది ఓ విధంగా విశేష‌ పరిణామమే.

ఎందుకంటే తమ పార్టీ అని గట్టిగా చెప్పుకునే ఆ సామ‌జికవర్గం ఇపుడు అటు బీజేపీకో, ఇటు వైసీపీకో వెళ్ళిపోవడం అంటే విడ్డూరమే. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి టీడీపీకి భవిష్యత్తు లేకపోవడం అన్నది నిర్దారణ అయిందని నమ్మడం. రెండవది లోకేష్ నాయకత్వాన్ని ఆమోదించకపోవడం. ఇలా బలమైన నాయకులు ఇపుడు బాబుకు గుడ్ బై చెబుతున్నారు. వారు బాబు మీద చేస్తున్న ఆరొపణలు ఒకటే ఆయన ఎవరి మాటలో వింటున్నారని, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని.  మరి బాబు పార్టీకి గుండెపట్టు లాంటి కులమే దూరమైతే మనుగడ ఉంటుందా..చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: