మ‌హామ‌లుపులు ఆగ‌డం లేదు. రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాల‌కు అంద‌ని చాణ‌క్య సూత్రాల‌కు నేత‌లు ప‌దును పెడుతున్నాయి. మ్యాజిక్ ఫిగ‌ర్‌ను నిరూపించేందుకు  పొత్తుల ఎత్తుల‌తో..వాద‌న‌లు..సంవాద‌న‌ల‌తో..చ‌ర్చ‌ల్లో మునిగి తేలుతున్నాయి. ఏ పార్టీకి సొంతంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ లేక‌పోవ‌డంతో సంకీర్ణ ఆలోచ‌న‌తో కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివ‌సేన ముందుకు సాగుతున్నాయి. గ‌త రాత్రి నుంచి ఈ చ‌ర్చ‌లు విస్తృతంగా సాగుతుండ‌టంతో దాదాపు కొలిక్కి వ‌చ్చే ప‌రిస్థితి క‌న‌బ‌డుతోంది. అయితే మూడు పార్టీలు ప‌దవుల‌ను స‌మానంగా పంచుకోవాల‌నే దానికి క‌ట్టుబ‌డి న‌ట్లు స‌మాచారం.


అయితే సీఎం పీఠం ఏ పార్టీకి అనే దానిపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌త రాలేద‌ని తెలుస్తోంది. ముఖ్య‌మైన అంశంమే అది కావ‌డంతో ఈ చ‌ర్చ‌లు చివ‌ర‌కు విఫ‌ల‌మైనా ఆశ్చ‌ర్య పోవ‌ద్ద‌న్న వాద‌న వినిపిస్తోంది. శివ‌సేన మెజార్టీ ప‌దవులు కోరుతుండ‌గా సీఎం పీఠం కూడా త‌న‌కే కావాల‌ని కోర‌తున్న‌ట్టు స‌మాచారం. అయితే ఇందుకు ఎన్సీపీ ఒప్పుకోవ‌డం లేదంట‌. ముఖ్య‌మంత్రి త‌మ పార్టీకే ద‌క్కాల‌ని కోరుతోందంట‌. కాంగ్రెస్ మంత్రి ప‌ద‌వుల‌తో స‌ర్దుకోవాల‌ని యోచిస్తోందంట‌.


ఇప్ప‌టి వ‌ర‌కు శివ‌సేన‌కు 16, ఎన్‌సీపీకి 14, కాంగ్రెస్‌కు 14 మంత్ర‌త్వ‌శాఖ‌లు కేటాయించాల‌ని ఒప్పందం కుదిరిన‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో స్పీక‌ర్గా కాంగ్రెస్ నేత‌ను..మండ‌లి చైర్మ‌న్‌గా ఎన్సీపీ నేత‌ను నియ‌మించాల‌ని నిర్ణ‌యించార‌ట‌. 40 అంశాల‌తో న‌వంబ‌ర్ 19వ వ‌ర‌కు ఉమ్మ‌డి ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేసేలా ఒప్పందం కుదిరిన‌ట్లు తెలుస్తోంది. మూడు పార్టీల అడుగుల‌ను బ‌య‌ట నుంచి బీజేపీ నిశితంగా ప‌రిశీలిస్తోంది. శివ‌సేన మొండిప‌ట్టుద‌ల‌తో త‌మ‌ను అధికారానికి దూరం చేసింద‌నే భావ‌న‌తో బీజేపీ శ్రేణులు ర‌గిలిపోతున్నాయ‌ట.


ఇదే అంశాన్ని ఇప్ప‌టికే జ‌నాల్లోకి తీసుకెళ్లి వారి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకున్నార‌ట‌. అధికారం కోసం బీజేపీ వెంప‌ర్లాడ‌దు. మోసం..ద‌గా చేయ‌డం బీజేపీ ర‌క్తంలోనే లేదు అంటూ శ్రేణులు ఉద్వేగ‌పూరిత వ్యాఖ్య‌లు..కామెంట్ల‌తో పార్టీని కీర్తిస్తూనే కాంగ్రెస్‌, శివ‌సే,ఎన్సీపీ నీచ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతూ ఉన్నాయంటూ తూర్పార‌బ‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: