ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో ప్రత్యేకంగా అయనను ఆశీర్వదించడానికి తెలంగాణ సీఎం శ్రీ కేసీఆర్ గారు విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో వారు మాట్లాడుతూ, ఇకపై మన రెండు రాష్ట్రాలు భాయి భాయి మాదిరిగా కలిసి ఉండి, ఒకరితో మరొకరు సాయం చేసుకుని రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందాం అని ఇద్దరు సీఎంలు చెప్పడం జరిగింది. దానితోపాటు ప్రత్యేక హోదా ఏపీకి ఇచ్చి తీరాలని, అవసరమైతే ఆ విషయమై ప్రధానికి లేఖ రాస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అలానే ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి నీటిని రెండు రాష్ట్రాల్లోని ప్రాంతాలను కలుపుతూ, శ్రీశైలం వరకు తీసుకెళ్లే ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్దం చేయడం కూడా జరిగింది. అయితే హఠాత్తుగా ఏమి జరిగిందో ఏమో తెలియదుగాని, ఇటీవల తెలంగాణ రైతుల సంక్షేమం కోసం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి వెళ్లిన ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు, నేడు ఏపీ ప్రభుత్వం తరపున కాళేశ్వరం ప్రాజక్ట్ కు జాతీయ హోదా ఇవ్వడానికి వీల్లేదని సుప్రీం కోర్ట్ లో ఒక అఫిడవిట్ వేయడం జరిగింది. 

మా ఆంధ్రప్రదేశ్ లోని రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా, ఎంతో విచక్షణా రహితంగా చేపట్టిన ఈ ప్రాజక్ట్ కు మేము విరుద్ధం అని, అందువలన దానికి జాతీయ హోదా ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం తమ అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. పోలవరం ప్రాజక్ట్ కు సంబంధించి తెలంగాణలోని ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపేయడంలో అభ్యంతరాలు చెప్పే హక్కు లేదని కూడా పేర్కొంది. అలానే పోలవరం ప్రాజక్ట్ విషయమై తెలంగాణను ప్రత్యేక పార్టీగా పరిగణించాల్సిన అవసరం లేదని కూడా పేర్కొనడం జరిగింది. అలానే తాము దాఖలు చేసిన అఫిడవిట్ లోన్ అన్ని అంశాలు సునిశితంగా పరిశీలించి గతంలో విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేలా కేంద్రానికి అనుమతినివ్వాలని, అలానే పిటీషనర్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ని కూడా కొట్టివేయాలని తెల్పడం జరిగింది. కృష్ణా బేసిన్లో 180 టీఎంసీల నీటి వినియోగం నిమిత్తం కాళేశ్వరం, సీతారామ, ఎత్తిపోతల పథకం తుపాకులగూడెం తదితర ప్రాజెక్టులు చేపట్టింది. ఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం చేపట్టినట్లు ఆ రాష్ట్రం చెబుతోంది. 

ఇది ముమ్మాటికీ నూతన ప్రాజెక్టు, ఈ నూతన ప్రాజెక్టుల వల్ల పోలవరం ధవళేశ్వరం బ్యారేజీ పై తీవ్ర ప్రభావం పడుతోంది, అపెక్స్ కౌన్సిల్ ముందు ఉంచాలని పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశామని తమ వ్యాజ్యంలో తెలిపింది ఏపీ ప్రభుత్వం. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుండి 80 టీఎంసీల జలాలు కృష్ణానదిలోకి తరలించాలి. అలానే పొరుగు రాష్ట్రాలతో ఒప్పందం ప్రకారం ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు హక్కుగా చెందుతాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోందని, పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టా, శ్రీశైలం రాయలసీమకు తరలిస్తున్న జలాల్లో 45 టీఎంసీలు కావాలని తెలంగాణ తమను కోరడం సరికాదు, అలానే అనే వారు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపింది. పోలవరం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 150అడుగులకు కేంద్ర జలవనరుల సంఘం అనుమతి ఇచ్చిందని అన్నారు. ఇక విభజన చట్టం ప్రకారం ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారు 

జలవనరుల నూతన బీఐఎస్ కోడ్ ప్రకారం స్పిల్ వే స్థిరత్వాన్ని తనిఖీ చేసి గరిష్టంగా 50 క్యూసెక్కుల వరద తట్టుకునేలా అనుమతి ఇచ్చిందని, స్పిల్ వే విడుదల సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్ల ఎగువ రాష్ట్రాలకే ఎక్కువ ప్రయోజనం అని పేర్కొంది. ఆ ప్రాంతాల్లో ముప్పు తగ్గుతుందని, తెలంగాణ కోరుతున్న తాజా పర్యావరణ అనుమతులు దిగువ జలాల ముగింపు అవసరం లేదని, అలానే డ్యాం ఎత్తు రిజర్వాయర్ సామర్థ్యం లో ఎలాంటి మార్పులు చేయలేదు అని తెలిపింది. రాజోలిబండ మళ్లింపు పథకం ప్రాజెక్టు ప్రారంభ స్థాయిలో నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల చివరి ఆయకట్టుకు జలాలు సరిగా అందడం లేదని, పోతిరెడ్డిపాడు నుండి అదనంగా నీరు విడుదల ఆరోపణలు సరికాదని, అలానే ఏపీలోని వెనుకబడిన ఏడు జిల్లాలకు కేంద్రం ఒక రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేయడం సరైనది కాదని పేర్కొన్నారు . మరి ఏపీ వాదనపై సుప్రీం కోర్ట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: