గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ టీడీపీని తూర్పారా బ‌డుతున్నారు. టీడీపీకి గుడ్‌బై చెప్పిన ఆయ‌న వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చేప‌డుతున్న ప‌నులు న‌చ్చే తాను వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతానికి తాను బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తు తెలప‌నున్న‌ట్లు కూడా తెలిపారు.  ఈమేర‌కు గురువారం విలేక‌రుల‌తో ముఖాముఖిగా మాట్లాడారు. ఈసంద‌ర్భంగా టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అనేక విషయాల‌పై టీడీపీలో పార్టీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌పై విమ‌ర్శ‌లు చేశారు.


పార్టీ అధినేత చంద్ర‌బాబు మొద‌లు ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌, గ‌తంలో ప‌నిచేసిన మంత్రులను ఇలా అంద‌రి తూర్పారా బ‌ట్టారు.  వ‌ర్ధంతికి...జ‌యంతికి తేడా తెలియ‌ని వాళ్లు కూడా పార్టీని నిర్వ‌హిస్తుంటే ఎలా..? అంటూ లోకేష్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. వంశీ విమ‌ర్శ‌ల‌తో పార్టీ అధిష్ఠానం వ‌ణికిపోతున్న‌ట్లు స‌మాచారం. ఇంత వ‌ర‌కు బాగానే వంశీ నోటి వెంట ఒక కొత్త విష‌యం బ‌య‌ట‌కి వ‌చ్చింది. టీడీపీకి చెందిన ఓ ముఖ్య‌మైన నేత  రాష్ట్రంలోనే ఒక పెద్దింటి మ‌హిళ‌కు ప‌దివేల‌కు పైగా అస‌భ్య‌క‌ర‌మైన మెయిల్స్ పంపార‌ని పేర్కొన్నారు. ఆ తర్వాత త‌ప్పు తెలుసుకుని కాళ్ల మీద ప‌డి త‌న‌ను క్ష‌మించాల‌ని వేడుకున్నాడ‌ని తెలిపారు.


ఇప్పుడు ఈ అంశంపై పెద్ద దుమారమే చెల‌రేగేట్లు క‌న‌బ‌డుతోంది. బాధితురాలైన ఆ మ‌హిళ ఎవ‌రూ...మెయిల్స్ పంపించినా నేత ఎవ‌రూ అనే దానిపై ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాలు ఎవ‌రికీ వారుగా ఆరా తీసే ప‌నిలో ఉండ‌టం గ‌మ‌నార్హం. వంశీ గ‌త కొద్దిరోజులుగా టీడీపీ అంటిముట్ట‌న‌ట్లుగా ఉంటూనే ఆ పార్టీ వ్య‌వ‌హ‌రాల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఇందులో చాలా వ‌ర‌కు నిజ‌మేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు న‌మ్ముతున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ  పెద్దింటి మ‌హిళ‌కు మెయిల్స్ పంపి వేధించారంటూ చేసిన కామెంట్‌లోనూ నిజ‌మే ఉండి ఉంటుంద‌న్న‌ది వారి విశ్వాసం. మ‌రి ఈ విష‌యం మళ్లీ వంశీయే బ‌య‌ట‌పెడుతారా..? లేక రాజ‌కీయ వ‌ర్గాల‌తోనే బ‌య‌ట‌కి వ‌స్తుందా అన్నది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: