నిరుపేదలకు పక్కా  ఇల్లు కట్టించేందుకు తెలంగాణ సర్కారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేరుతో పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా కూకట్ పల్లి నియోజకవర్గంలో నిరుపేదల కల నెరవేరింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూకట్ పల్లి  నియోజకవర్గ పరిధిలో 101.69 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ క్రమంలోనే నిరుపేదలకు 9.34 కోట్లతో నిర్మించిన 108 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. దీంతోపాటు ఇండోర్ స్టేడియం,  మోడ్రన్ ఫిష్  మార్కెట్ ను కూడా ప్రారంభించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా భాగ్యనగరంలోని నిరుపేదల అందరికీ 8500 కోట్ల తో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయించిందని కేటిఆర్ తెలిపారు. దీనిలో భాగంగానే ఇదివరకే నాచారంలోని సింగం చెరువు తండ లో ఇన్ సిటు  పద్ధతిలో  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించారు. ఇక తాజాగా కూకట్పల్లి నియోజకవర్గం చిత్తారమ్మ బస్తీలో  రెండో కాలినిని  ప్రారంభించారు. 



 అయితే ఈ డబుల్ బెడ్ రూం ఇండ్ల లకు సంబంధించి ఇదివరకే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయగా. గురువారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం అనంతరం గృహ ప్రవేశాలు చేశారు లబ్ధిదారులు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్ మల్లారెడ్డి మేయర్ బొంతు రామ్మోహన్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవ రావు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. కాగా  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రులకు ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. కాగా తొమ్మిది అంతస్తుల్లో  నిర్మించిన ఈ డబుల్ బెడ్రూం గృహాలు సంప్రదాయాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. 



 ఎన్నో దశాబ్దాలుగా మురికివాడలో చిన్న చిన్న గుడిసెలో నివసిస్తున్న పేద కుటుంబాలకు... విశాలమైన సకల సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం అందించడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాకుండా 6.51 కోట్లతో రెండు ఇండోర్  స్టేడియాలు ప్రారంభానికి కూడా కేటీఆర్ శ్రీకారం చుట్టారు.   2.78 కోట్లతో హోల్సేల్ ఫిష్ మార్కెట్ ను కూడా ప్రారంభించారు. ఇక కూకట్పల్లి వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: