తాజాగా సుప్రీంకోర్టు వివాదాస్పద అయోధ్య భూభాగంపై కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే 3పదుల సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో వాయిదా పడుతూ వస్తున్న వివాదానికి తాజాగా ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. 2.77 ఎకరాల అయోధ్య విభాగంలో మసీదు నిర్మించారని ముస్లింలు...రామ మందిరం  నిర్మించాలని హిందువులు మధ్య తలెత్తిన వివాదానికి తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో తెరదించింది. అయోధ్య భూభాగం తమకు చెందినది  అంటూ ముస్లిం  సంస్థలు నిరూపించుకోకపోవడంతో... అయోధ్య భూభాగాన్ని   హిందువులకు చెందిన న్యాస్  సంస్థకు అప్పగిస్తూ తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. అంతేకాకుండా రామా మందిర  నిర్మాణం  కోసం ట్రస్ట్  ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది . 



 అయోధ్యలోననే  బాబ్రీ మసీద్ నిర్మించడానికి ముస్లింలకు ఐదెకరాల భూమిని కేటాయించాలని సూచించింది. అయితే దీనిపై దేశ ప్రజలందరూ హర్షధ్వానాల వ్యక్తం చేశారు.కాగా  హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాత్రం సుప్రీంకోర్టు తీర్పు పై కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుని అందరిలా  గౌరవిస్తున్నానని కానీ సుప్రీం కోర్టు తీర్పు విషయంలో పొరపాటు చేయదు  అని లేదు కదా.. ముస్లింలు భూమి కోసం పోరాడలేదని... ఎవరి దయాదాక్షిణ్యాలు  మాకు అవసరం లేదంటూ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే యూపీలో ఓవైసీ పై పవన్ కుమార్ అనే అడ్వాకెట్  పోలీస్ స్టేషన్లో  పిర్యాదు చేసారు . 



 ఇక తాజా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పై యూపీలో మరో కేసు నమోదైంది. యూపీలోని అఖండ ఆర్యావర్త  నిర్మాణ సంఘ్  అనే హిందూ సంస్థ కేసు పెట్టింది. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు తర్వాత అసదుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దేశంలో మతసామరస్యం దెబ్బతినేల  ఓవైసీ వ్యాఖ్యలు ఉన్నాయని... ఈ వ్యాఖ్యలు మానవతకే కాదు దేశ ఐక్యతకు కూడా విఘాతం కలిగిస్తాయని  అంటూ సంఘ్  అధ్యక్షుడు భూపేష్ శర్మ పిర్యాదు లో  తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: