కేంద్ర వాణిజ్య పారిశ్రామిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇదివరకు మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించారన్న విషయం తెలిసిందే.. అమెరికా-భారత్‌ల మధ్య వాణిజ్యంపై నెలకొన్న ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఈ పర్యటనలో చర్చలు జరిపారు. అమెరికాలో వాణిజ్య శాఖ మంత్రి రాబర్ట్‌ లిథిజియర్‌తో గోయల్‌ సమావేశమయ్యారు. అంతే కాకుండా న్యూయార్క్‌లోని వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులతోనూ ఆయన భేటీ అయ్యారు.


ఇకపోతే ఈ చర్చలు ఫలించినట్లున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో ఎదురుచూస్తున్న చూపులకు చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు గాను ఈ ఒప్పందానికి తుది రూపునిచ్చేందుకు అమెరికా ప్రతినిధులు వచ్చే వారం భారత్ కు రానున్నారు. ఇకపోతే నవంబరు 12న పీయూష్  గోయల్  అమెరికా పర్యటనకు వెళ్లి అక్కడి ప్రతినిధి రాబర్ట్  లైట్ హైజర్ తో విస్తృత స్థాయి చర్చలు జరిపారు.


ఈ క్రమంలో ఒప్పందంలో సంక్లిష్టంగా మారిన అనేక అంశాలపై ఓ అవగాహన కుదిరినట్లు సమాచారం. ఇక భారత్ ను ప్రాధాన్య వాణిజ్య హోదా జాబితా నుంచి గత జూన్ లో అమెరికా తొలగించి భారత్ కు చెందిన ఉత్పత్తులపై అగ్రరాజ్యం అధిక సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా అమెరికా వస్తువులపై కూడా భారత్ సుంకాలు పెంచింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు తెలెత్తాయి.


దీనిపై ఉభయ దేశాల వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో వీటి పరిష్కారం దిశగా రెండు దేశాల ప్రతినిధులు, మంత్రులు విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే దీనిపై ఓ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అమెరికాతో భారత్ కు చెందిన ఉత్పత్తుల వ్యవహారం సజావుగా సాగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: