కొన్ని దశాబ్దాలుగా రగులుతున్న  వివాదానికి తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ముగింపు పలికిన విషయం తెలిసిందే. వివాదాస్పద అయోధ్య భూభాగంలో బాబ్రీ మసీదు నిర్మించాలని ముస్లింలు... రామమందిరం  నిర్మించాలని హిందువుల మధ్య తలెత్తిన వివాదానికి తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం తెరదించింది . వివాదాస్పద అయోధ్య భూభాగంపై సంచలన తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత ధర్మాసనం వివాదాస్పద అయోధ్య భూభాగంపై తీర్పును వెలువరించింది. అయితే వివాదాస్పద 2.77 ఎకరాల భూభాగం తమదేనంటూ ముస్లిం సంస్థలు నిరూపించుకోకపోవడంతో అయోధ్య స్థలాన్ని హిందువులకు చెందిన న్యాస్ కు అప్పగించింది సుప్రీంకోర్టు. 

 

 

 
 
 
 దీనికి గాను  ప్రత్యామ్నాయంగా ముస్లింలకు మసీదు ఏర్పాటుకు  సున్ని వక్ఫ్ బోర్డుకు  ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని తీర్పునిచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై ప్రజలందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే అయోధ్య విభాగంలో రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్  ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు. అయితే తాజాగా రామమందిర నిర్మాణానికి విరాళం అందింది. అయోధ్య రాముడు తో తమకు అనుబంధం ఉందని... రామమందిర నిర్మాణానికి తాము అనుకూలమని షియా సెంట్రల్ వక్ఫ్  బోర్డ్ చైర్మన్ వసీం రిజ్వి తెలిపారు. 

 

 

 
 
 
 
 అందుకే రామమందిరం నిర్మాణానికి 51 వేల విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. వసిం రిజ్ ఫిల్మ్స్ తరపున రామ మందిర నిర్మాణానికి 51 వేల విరాళాన్ని అందించారు ఆయన. రామజన్మభూమి న్యాస్ కు తాము  విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. వివాదాస్పద అయోధ్య భూభాగంలో రామమందిర నిర్మాణం రామ  భక్తులకు గర్వకారణం అంటూ వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా  సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా అధికారులు ఇద్దరు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయగా..  ల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అంతా ప్రశాంతంగానే ముగిసింది.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: