రాజకీయాలు ఎప్పుడు ఒకలా ఉండవని ఏపీ రాజకీయాలని చూస్తే అర్ధమైపోతుంది. అప్పటికప్పుడు పరిస్థితులని బట్టి నేతల పార్టీల మార్పు షాకుకు గురి చేస్తున్నాయి.  ముఖ్యంగా ఈ షాకులు ప్రతిపక్ష టీడీపీకి గట్టిగా తగులుతున్నాయి. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీని నేతలు వరుసగా వీడుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తున్న సమయంలో కృష్ణా జిల్లాకు చెందిన బడా నేతలు టీడీపీకి గట్టి దెబ్బవేశారు. తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్, వల్లభనేని వంశీలు టీడీపీతో తెగదెంపులు చేసుకున్నారు.


అయితే అవినాష్ సైలెంట్ గా వెళ్ళి వైసీపీలో చేరితే, వంశీ ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబుని ఏకేసారు. తాను జగన్ కు మద్ధతు ఇస్తున్నానని, అవసరమైతే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానని ప్రకటన చేశారు. ఇక వంశీ ప్రకటనతో జగన్ చిక్కుల్లో పడ్డట్టు అయింది. ఎందుకంటే మొన్నటివరకు వంశీ టీడీపీకి రాజీనామా చేసిన, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంలో ఆలోచనలో ఉన్నారు. జగన్ ఏమో తప్పనిసరిగా రాజీనామా చేసే పార్టీలోకి రావాలని సూచించారు. దీంతో వంశీ కొన్ని రోజులు సైలెంట్ అయిపోయారు.


అటు జగన్ కూడా వంశీని చేర్చుకోవడానికి పెద్ద ఆసక్తి చూపలేదు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు దీక్ష తెరపైకి వచ్చిందో అదే సమయంలో వైసీపీ తెలివిగా వ్యవహరించి, వంశీని లైన్ లోకి దించి చంద్రబాబుని తిట్టించింది. పనిలో పనిగా వైసీపీలోకి వస్తానని, ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న చేస్తానని చెప్పాడు. ఇలా చెప్పడంతో బంతి జగన్ కోర్టులోకి వెళ్లింది. ఆయన చెబితేనే వంశీ రాజీనామా చేసే అవకాశముంది. ఒకవేళ రాజీనామా చేయించకుండా పరోక్షంగా మద్ధతు తీసుకున్న అది ప్రజల్లో నెగిటివ్ అవుతుంది. మరి చూడాలి వంశీ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.?..పార్టీలో ఎప్పుడు చేర్చుకుంటారో?


మరింత సమాచారం తెలుసుకోండి: