ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సంక్షేమానికి కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిరుపేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకు వచ్చారు. వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు  జరిగితే అది ఆరోగ్యశ్రీ కిందికి వస్తుందని జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉండే ఏపీ ప్రజలకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక తాజాగా  ఆరోగ్యశ్రీ కి సంబంధించి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో కీలక మార్పులు తీసుకొచ్చిన సీఎం జగన్... సాధ్యమైనంత ఎక్కువమందికి ఆరోగ్యశ్రీ పథకం అమలు అయ్యేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది జగన్ సర్కారు. 



 5 లక్షల ఆర్థిక ఆదాయం ఉన్నవారికి కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది . వైయస్సార్ పెన్షన్ కానుక కార్డు,  జగనన్న విద్య,  వసతి  దీవెన కార్డులు  ఉన్న వారు కూడా ఈ పథకానికి అర్హులు అంటూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా 334 చదరపు గజాల ఉన్న ప్రాంతానికి మున్సిపాలిటీకి ఆస్తిపన్ను కడుతున్న వారిని  ఆరోగ్యశ్రీ పథకానికి వర్తింపజేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కుటుంబంలో ఒక కారు కంటే ఎక్కువ ఉన్నవాళ్లు ఈ పథకాన్ని అనర్హులు అంటూ  తెలిపింది జగన్ సర్కార్. 



 అంతేకాకుండా 12 ఎకరాల మాగాణి 35 ఎకరాలు మెట్ట భూమి ఉన్నవారికి కూడా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా కీలక మార్పులు తీసుకువచ్చింది జగన్ సర్కార్. అన్నిరకాల బియ్యం కార్డులు కలిగిన వారు ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులుగా తేల్చింది. ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎక్కువ మొత్తంలో ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే మార్గదర్శకాలను రూపొందిస్తోంది. అయితే ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఆంధ్రప్రదేశ్ తో పాటు  బెంగళూరు హైదరాబాద్ చెన్నై కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకుంది  జగన్ సర్కార్.


మరింత సమాచారం తెలుసుకోండి: