మహారాష్ట్ర రాజకీయాల్లో  ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో రోజుకో మలుపు తిరుగుతుంది. బీజేపీ శివసేన కూటమికీ మ్యాజిక్ ఫిగర్ కు  మించిన సీట్లు సాధించినప్పటికీ... శివసేన అభ్యర్థికి సీఎం సీటు కేటాయించాలని చెప్పడంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు. మహారాష్ట్రలో ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే శివసేన పార్టీ ఎన్సీపీ కాంగ్రెస్ మద్దతు కూడగట్టుకోవడంలో కూడా  విఫలమవడంతో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్  కోషియారీ  మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన చేపట్టాలని కేంద్రానికి సిఫారసు చేయగా  కేంద్ర ఆమోదంతో ప్రస్తుతం మహారాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. 



 అయితే తాజాగా మహారాష్ట్రలో ఏర్పడిన ప్రతిష్టంభనకు  తెర పడినట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అయిదేళ్లపాటు శివసేన ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ఎన్సీపీ కాంగ్రెస్ అంగీకరించినట్లు సమాచారం. అలాగే ఎన్సీపీ కాంగ్రెస్లకు డిప్యూటీ సీఎం సహా 14 మంత్రి పదవులు ఇచ్చేందుకు శివసేన ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కలిపి ఉమ్మడి ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగబోతున్నట్లు  తెలుస్తోంది. 



 ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్ నేత వీర్ సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలని శివసేన  డిమాండ్ పెట్టగా... ముస్లింలకు 5%శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎన్సీపీకాంగ్రెస్ ప్రణాళికను  పొందుపరిచాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇదే ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరత్ పవర్  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ భేటీలో శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తో శరత్ పవార్ చర్చించనున్నట్లు తెలుస్తుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: