టీడీపీ పార్టీ నుంచి గన్నవరం ఎమ్మెల్యే బయటికి పోతూ చంద్రబాబు మీద సీరియస్ వ్యాఖ్యలు చేశారు. 2009లో పార్టీ కోసం పని చేసిన ఎన్టీఆర్ ను బాబు కావాలనే పార్టీ నుంచి దూరం చేశాడని వంశీ ఆరోపించారు.  2009లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని అప్పటి టీడీపీ నేతలుగా ఉన్న వల్లభనేని వంశీ కొడాలి నానిలు స్వయంగా ఎన్టీఆర్ ను ఒప్పించి తీసుకొచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్టీఆర్ ఎందుకు మళ్లీ టీడీపీవైపే రావడం లేదు..? ఈ ప్రశ్నకు తాజాగా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఆయన ఎన్టీఆర్ చంద్రబాబు తెరవెనుక రాజకీయంపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన వంశీ దీని గుట్టువిప్పాడు.


ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ ఒక తార జువ్వలా ప్రచారాన్ని చేశారు. తలపండిన రాజకీయ నేతలు కూడా ఎన్టీఆర్ మంచి నాయకుడవుతాడని భావించారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్టీఆర్ కు చంద్రబాబే పొగబెట్టాడని వంశీ సంచలన కామెంట్ చేశారు. ఎన్టీఆర్ పై తప్పుడు ప్రచారాలు చేయించాడని తెలిపారు. దీంతో ఆత్మాభిమానం అడ్డువచ్చి ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారని వంశీ సంచలన నిజాలు చెప్పుకొచ్చాడు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడని.. ఎన్టీఆర్ ను దూరం పెట్టింది అందుకేనని అన్నారు. 2014లో పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి చంద్రబాబు బతిమిలాడింది అందుకేనన్నారు.


ఇలా చంద్రబాబు అందరినీ వాడుకొని వదిలేసే రకమని వంశీ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కు సన్నిహితుడైన కొడాలి నాని వైసీపీలో మంత్రిగా ఉండడం.. ఇప్పుడు వంశీ కూడా వైసీపీలో చేరడంతో ఎన్టీఆర్ కూడా వైసీపీలోకి వస్తారా అని వంశీని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం గొప్ప సినిమాలు చేస్తూ సంతోషంగా ఉన్నాడని.. భవిష్యత్తు గురించి తాను చెప్పలేనంటూ దాటవేశాడు. ఎప్పటికైనా రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడని.. కానీ వైసీపీలోకి వస్తాడని మాత్రం స్పష్టత ఇవ్వలేనని చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: