ఇసుక మీద పోరాటం చేయాలనీ చంద్రబాబు 12 గంటలు దీక్ష చేస్తే టీడీపీ నుంచి కనీసం పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు కూడా రాని పరిస్థితి. మరో పక్క సరిగ్గా అదే రోజున దేవినేని అవినాష్ .. గన్నవరం ఎమ్మెల్యే వంశీ పార్టీ మారుతున్నట్టు చెబుతూ బాబు మీద ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇది నిజంగా చంద్రబాబుకు షాక్ అని చెప్పాలి. విజయవాడలో చంద్రబాబు ఇసుక దీక్ష వేళ టీడీపీకి గట్టి షాకులే తగిలాయి. తెలుగుదేశం పార్టీ నుంచి మొత్తం గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు కూడా దీక్షకు హాజరు కాకపోవడం కలకలం రేపింది. వారంతా టీడీపీలో ఉంటారా ఊడుతారా అన్న టెన్షన్ ఇప్పుడు టీడీపీని పట్టిపీడిస్తోంది. కేవలం 9 మంది ఎమ్మెల్యేల మాత్రమే బాబు ఇసుక దీక్షకు హాజరయ్యారు. ఈ 14మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉండడం తో టీడీపీ కి టెన్షన్ పట్టుకుంది.


అందులో ఎంత మంది వైసీపీ వైపు చూస్తున్నారని ఇప్పుడు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగిస్తున్నాయి. ఓవైపు ఇసుక కొరతపై చంద్రబాబు విజయవాడలో దీక్షకు దిగితే అదే సమయంలో చంద్రబాబు తీరు నచ్చక పార్టీని వీడారు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.  ఆరు నెలలు కూడా కానీ వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు టార్గెట్ చేయడం ఏంటని కడిగిపారేశారు. తెలంగాణలో ఎందుకు ఆందోళన చేయడం లేదని నిలదీశారు. పవన్ వైఖరి ని చీల్చిచెండాడాడు. ఇక టీడీపీనే సర్వస్వంగా నిన్నటి వరకు ఉన్న దేవినేని అవినాష్ ఫ్యామిలీ సడన్ గా టీడీపీ కి గుడ్ బై చెప్పి జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం టీడీపీని కోలుకోకుండా చేసింది.


ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా బాబు దగ్గరికి రాకపోయేసరికి టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైంది. ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు దీక్ష కు దూరంగా ఉండడం.. టీడీపీలో మెరుగైన ఇద్దరు యువ నేతలు వైసీపీ బాట పట్టడం తో టీడీపీ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్టీ లో అసంతృప్తి పీక్ స్టేజ్ లో ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో మంత్రులు గా చేసిన గంటా శ్రీనివాసరావు నారాయణ వంటి నేతలు కూడా రాక పోవడంతో టీడీపీకి వారంతా గుడ్ బై చెప్పబోతున్నారా అన్న ఆందోళన నెలకొంది. వైసీపీ బీజేపీ టార్గెట్ చేసిన నేపథ్యం లో అసలు టీడీపీ బతికి బట్ట కడుతుందా ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న టెన్షన్ తెలుగు తమ్ముళ్లను వెంటాడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: