ఆధార్ కార్డు దేశంలో ప్రతిఒక్కరికి తప్పక ఉండాల్సింది. ఒకప్పుడు ఏదైనా అప్డేట్ చేస్తే తెలుసుకోవడం చాల కష్టం అలాంటిది ఇప్పుడు యూఐడీఏఐ పుణ్యమా అని ఎన్నో రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. ఈ యూఐడీఏఐతో ఆధార్ అప్‌డేట్, స్టేటస్ చెక్ వంటి సర్వీసులను ఆన్‌లైన్2లో పొందవచ్చు. యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆధార్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. ఎన్‌రోల్‌మెంట్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేసి ఈ పని పూర్తిచేయవచ్చు.


అయితే ఈ అప్డేట్ అయ్యిందా లేదా అనేది కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే కాదు 1947 నెంబర్‌కు కాల్ చేసి కూడా ఇ-ఆధార్ జనరేట్ అయ్యిందా? లేదా? అనే విషయాన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఎన్‌రోల్‌మెంట్ తర్వాత యూఆర్ఎన్ నెంబర్ సాయంతో ఆధార్ కార్డు అడ్రస్ అప్‌డేట్ స్టేటస్‌ను వెంటనే తెలుసుకోవచ్చు. అయితే ఈ ఆధార్ అప్డేట్ ఎలా తెలుసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 


యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లి.. మై ఆధార్ ట్యాబ్‌లోకి వెళ్ళాలి. అక్కడ గెట్ ఆధార్ కింద చెక్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ చెక్ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, క్యాప్చా ఎంటర్‌ చేసి స్టేటస్‌ను తెలుసుకోవాలి. ఆధార్ అప్‌డేట్ అయ్యి ఉంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా అప్‌డేట్ సెంటర్‌లో అప్‌డేట్ చేసుకొని ఉంటే ఈ విధానం వర్తిస్తుంది.


అయితే ఒకవేళ అదే ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ చేసి ఉంటే, దాని స్టేటస్ తెలుసుకోవాలని అనుకుంటే దానికి కూడా యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. మై ఆధార్ ట్యాబ్ కింద అప్‌డేట్ యువర్ ఆధార్ కింద చెక్ అడ్రస్ అప్‌డేట్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ అడ్రస్ అప్డేట్ పై క్లిక్ చేసి అడ్రస్ అప్‌డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. దీనికి అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ కూడా అవసరం ఉంటుంది. అంతే క్షణాల్లో మీ ఆధార్ అప్డేట్ తెలుసుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: