చంద్రబాబునాయుడు మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ మీద సస్పెన్షన్ వేటు వేటయానికి రంగం సిద్ధమైంది. గురువారం చంద్రబాబు ఇసుక కొరత మీద దీక్ష చేస్తున్న సమయంలోనే వంశీ పార్టీ అధినేతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన  విషయం అందరికీ తెలిసిందే.  శుక్రవారం ఉదయం పార్టీలోని నేతలతో చంద్రబాబు సమీక్ష జరిపారు.

 

సమావేశం సందర్భంగా చంద్రబాబు, లోకేష్ పై ఎంఎల్ఏ చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు అండ్ కో ఆందోళనలు చేయటాన్ని, విమర్శలు చేయటంతో పాటు దీక్షలు దిగటాన్ని ఎంఎల్ఏ తప్పు పట్టారు. జగన్ కు జనాలు  ఫుల్ మ్యాండేట్ ఇచ్చినపుడు ప్రభుత్వానికి కొంత గడువు ఇవ్వాలని వంశీ సూచించారు.

 

మొత్తానికి టిడిపిలోనే ఉంటూ జగన్ కు మద్దతుగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు వంశీ బహిరంగంగానే చెప్పేశారు. ఒక విధంగా ఎంఎల్ఏ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును బాగా ఇరకాటంలోకి నెట్టేశాయనే చెప్పాలి.  ఈ సమస్యను వెంటనే కంట్రోల్ చేయలేకపోతే ఇది ఎక్కడికి దారితీస్తోందో అన్న టెన్షన్ మొదలైంది. అందుకనే  వంశీకి నోటిసిచ్చి వెంటనే సస్పెండ్ చేయాలని డిసైడ్ చేసింది సమావేశం.

 

ఇదే విషయాన్ని పాలకొల్లు ఎంఎల్ఏ రామానాయుడు చెబుతూ ఎంఎల్ఏకి నోటిసిచ్చి సస్పెండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. అంటే నోటిసు ఇవ్వటమన్నది కేవలం లాంఛనం మాత్రమే అని తేలిపోయింది. నోటిసుకన్నా సస్పెన్ష్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్ధమైపోయింది.

 

సరే వంశీ కూడా నోటిసు, సస్పెన్ష అనే చర్యలకు మానసికంగా సిద్ధపడే ఉన్నారు. అందుకనే టిడిపిలోనే ఉంటు వైసిపికి మద్దతు పలకటంలో వచ్చే టెక్నికట్ సమస్యలను తాను ఫేస్ చేస్తానని మీడియా సమావేశంలోనే చెప్పారు. అంటే వంశీకి కూడా సస్పెండ్ అవుతానన్న విషయం తెలుసు.  మరి వంశీ వ్యాఖ్యలపై సస్పెన్ష్ తో పాటు పార్టీ లైన్ ను ధిక్కరిస్తున్నారంటూ  అసెంబ్లీకి కూడా టిడిపి ఫిర్యాదు చేస్తుందేమో చూడాలి. నిజంగానే టిడిపి గనుక ఫిర్యాదు చేస్తే వంశీ సభ్యత్వాన్ని కోల్పోవటం ఖాయమనే తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: