దేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా. తన కస్టమర్లకు ఎన్నో ఆఫర్లు ఇస్తూ ఎన్నో రకాల సేవలను అందిస్తోంది ఎస్బిఐ. ఈ బ్యాంకులో డిపాజిట్ స్చెమ్స్ కూడా చాల ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం సుకన్య సమృద్ధి స్కీం. ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ కూడా ఇందులో ఒక భాగమే. 


ఈ స్కీంతో ఒక కుటుంబంలో ఇద్దరు చిన్నారుల పేరుపై ఈ ఖాతాలను తెరవొచ్చు. ఒకవేళ కవలలు పుడితే అప్పుడు ముగ్గురి పేరుపై కూడా సుకన్య యోజన ఖాతాను ప్రారంభించొచ్చు. ఈ స్కీంకు బ్యాంకుల్లోనూ, పోస్టాఫీసుల్లో ఈ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే స్టేట్ బ్యాంక్ బ్రాంచులు దాదాపు ప్రతి పట్టణంలో ఉంటాయి కాబట్టి ఈ బ్యాంకులో సుకన్య అకౌంట్ తెరవడం చాలా సులభం. అయితే ఎస్‌బీఐ సుకన్య సమృద్ది అకౌంట్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఇక్కడ చదివి తెలుసుకోండి. 


పదేళ్ల వయసులోపు ఉన్న ఆడ పిల్ల పేరుపై ఆమె తల్లిదండ్రులు లేదా సంరక్షులు సుకన్య సమృద్ది ఖాతాను తెరవొచ్చు. అయితే కనీసం రూ.1,000తో సుకన్య సమృద్ది ఖాతాను ప్రారంభించాలి. అయితే సుకన్య సమృద్ధి యోజనలో ఒక ఆర్థిక సంవత్సరంలో అకౌంట్‌లో కేవలం 1,50,000 వరకు మాత్రమే డిపాజిట్ చేయగలం. సుకన్య సమృద్ది అకౌంట్ ప్రారంభించిన దగ్గరి నాటి నుంచి 21 ఏళ్లు వరకు ఈ ఖాతా కొనసాగుతుంది. 


ఖాతా తెరిచిన దగ్గరి నుంచి 15 ఏళ్లు అకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చెయ్యాలి. ఎస్‌బీఐ సుకన్య సమృద్ది అకౌంట్‌పై 8.4 శాతం వడ్డీ రేటు వస్తుంది. వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతు ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద సుకన్య సమృద్ది ఖాతాలో డిపాజిట్ చేసిన, అర్జించిన వడ్డీ, విత్‌డ్రా మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. 


అలాగే తీవ్రమైన అనారోగ్యం, డిపాజిటర్ మరణించడం వంటి అనూహ్య పరిస్థితుల్లో అకౌంట్‌లోని డబ్బులు ముందుగానే వెనక్కు తీసుకోవచ్చు. ఆడ పిల్లకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఉన్నత చదువులు లేదా పెళ్లి కోసం అకౌంట్ నుంచి 50 శాతం డబ్బుల్ని వెనక్కు తీసుకోవచ్చు. మిగతా మొత్తాన్ని అకౌంట్ మెచ్యూరిటీ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా కూడా అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఫెసిలిటీని పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు ఆడపిల్లలు ఉంటె వెంటనే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లను తెరిచి మంచి భవిష్యేత్తును ఇవ్వండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: