ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీరుపై వైసీపీ ఘాటుగా స్పందించింది. ఇసుక కొరతపై టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన దీక్షపై పార్టీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు రియాక్ట‌య్యారు. జ‌న‌సేన అధినేత‌ పవన్ కల్యాణ్‌ను మించిన మహానటుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ``ఆరు నెలలు అధికారం లేకపోయేసరికి చంద్రబాబు ప్రస్టేషన్లో ఉన్నారు. వికృత రూపం ప్రదర్శిస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నవ్యక్తి ఇసుకదీక్షలో డ్రామాలు ఆడారు. పలుగు,పారలు కెమెరాలకు కనబడేలా చేయాలని దీక్షలో కూర్చున్నవారికి చంద్రబాబు డైరక్షన్ చేస్తున్నారు. బొచ్చా, పార పట్టుకున్నవారినే కాదు పవన్ కల్యాణ్‌తో సైతం బాగా నటింప చేస్తున్నారు.`` అని మండిప‌డ్డారు.


చంద్రబాబుకు డబ్బు పిచ్చి పట్టుకుందని అంబ‌టి రాంబాబు ఎద్దేవా చేశారు. సీఎం వైయస్ జగన్ గురించి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. ``151 సీట్లతో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే చంద్రబాబు కంగారు పడుతూ అందర్ని కంగారు పడమని చెబుతున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి పై చర్యలు తీసుకుంటున్నారా లేదా గుండెపై చేయివేసుకుని చెప్పు.. చంద్రబాబూ. పొలిటికల్ అవినీతిని అరికట్టాలని జగన్ ప్ర‌యత్నిస్తున్నారు. అలా చేస్తుంటే జే టాక్స్ అని మాట్లాడతారా? మీరు మీ కాలంలో వసూలు చేశారు ఎక్కడపడితే అక్కడ మీ ఎంఎల్ఏలు మంత్రులు వసూలు చేసారు. అది చూసి మిమ్మల్ని జనం ఛీకొట్టి 23 సీట్లకు పరిమితం చేశారు. రాష్ర్టంలో మద్యనిషేధంపై విమర్శలు చేస్తున్నారు. లిక్కర్ ధర 70 రూపాయలు పెరిగిందంట. దాంట్లోకూడా దోచుకుంటున్నారని మాట్లాడుతున్నారు. మేం ఎన్నికల ముందు చెప్పినట్లు లిక్కర్ పట్టుకుంటేనే షాక్ కొట్టేలా చేస్తాం. దశల వారీగా మద్యనిషేధం తెస్తామని చెప్పాం.అదే విధంగా నేడు చేస్తున్నాం.`` అని ప్ర‌క‌టించారు. 


అన్నాక్యాంటిన్లు మూసివేశారు కాబట్టి జనం అల్లాడిపోతున్నారని అన‌డంపై అంబ‌టి రాంబాబు ఎద్దేవా చేశారు. ``మీరు అన్నాక్యాంటిన్లు తెచ్చింది ఎప్పుడు? మేమలా ఎన్నికలకు ముందు పథ‌కాలు తెచ్చి ప్రజలను మోసం చేయలేం. 50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారంట. ఎక్కడ చనిపోయారండి. అధర్మంగా వ్యవహరించకండి. లోకేష్, చంద్రబాబులు శవ రాజకీయాలు చేస్తున్నారు. వెనకబడిన వర్గాల వారంటే వైయస్ జగన్‌కు కక్ష కాబట్టి ఇసుక సమస్యను తెచ్చారు అని దారుణంగా మాట్లాడుతున్నారు. వెనకబడిన వర్గాల వారు ఎన్టీఆర్ ఉన్నప్పుడు టిడిపికి మధ్దతుగా ఉన్నారు.చంద్రబాబు మోసం చేయడంతో వారంతా వైయస్ జగన్‌కు మధ్దతు పలికారు`` అని వెల్ల‌డించారు.


చంద్రబాబు ఆదేశాలమేరకు పవన్ కల్యాణ్ నడుస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. ``ప‌వన్ కల్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. తాట తీసి మూలన కూర్చోబెడతాను. జగన్ 16 నెలలు జైలులో ఉన్నారు అంటూ మాట్లాడిన మాటలు వ్యక్తిగతమా?పాలసీలపై మాట్లాడటమా.? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కల్యాణ్ కు లేదు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను విమర్శిస్తున్న మీకు ఎక్కడనుంచి ప్యాకేజిలు వస్తున్నాయి.  వైఎస్ జగన్ హిందూవ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దివంగత వైయస్ ఏ మతమో వైయస్ జగన్‌ది అదే మతం కదా. పరిపాలనకు, మతానికి ముడిపెట్టి జగన్ గారు హిందూవ్యతిరేకి అని ముద్రవేయడానికి ప్రయత్నిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. జగన్ త‌న‌ పాదయాత్రకు ముందు శ్రీవారిని దర్శించుకున్నారు. అసలు రాజకీయాలలో మతప్రస్తావన ఎందుకు తీసుకుతెస్తున్నారు? అని ప్ర‌శ్నించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: