తిండి, నీళ్లు ఏ కాదు ఇంకా గాలి కూడా కొనాల్సిందే.. ఏంటి ఎందుకు ఇలా అని అనుకుంటున్నారా ? నిజం అంది బాబు. ఇన్నాళ్లు భ‌గ‌వంతుడు ఇచ్చిన పంచభూతాలలో నేల, నీరు, నిప్పు, ఆకాశం తో అనేక వ్యాపారాలను చేసుకుంటున్నాం. మంచి లాభాలతో ఎదుగుతున్నాం. అయితే ఇప్పటి వరకు ఐదొవ పంచభూతం గాలి కొనుక్కొనే అవసరం లేకుండా పోయింది. 


కానీ ఇప్పుడు ఈ గాలి కూడా కొనుక్కునే రోజులు వచ్చేశాయి. ఇప్పటికే ప్రజల ఆరోగ్యాలతో బాగా వ్యాపారాలు చేసే వారికీ ఇప్పుడు ప్రకృతి కూడా బాగా సహకరిస్తుంది. ఏం చెప్తున్నారు వీళ్ళు అనే సందేహం కలుగుతుందా ? అదేనండి ఢిల్లీలోని గాలి గురించి చెప్తున్నా. ఇంకా విషయానికి వస్తే మన దేశ రాజధాని అయినా ఢిల్లీలో రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుంది. 


ఎటువంటి మాస్కులు లేకుండా ఢిల్లీ వాతావరణంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ప‌ర్యాట‌కుడిగా తిరిగితే ఖ‌చ్చితంగా రోగాలు కొని తెచ్చుకోవ‌ట‌మే. ఇప్ప‌టికే మంచినీళ్లు సీసాలో పెట్టి లీటర్ల లెక్కన అమ్ముతూ వచ్చిన వ్యాపారులు ఢిల్లీలో వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని సొమ్ము చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. స్వచ్ఛమైన గాలి కేవలం రూ.299 మాత్రమే అంటూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పించేస్తూ, వ్యాపారం చేసేస్తున్నారు. 


దేశ రాజధాని అయినా ఢిల్లీలో 'ఆక్సి ప్యూర్' అనే పేరుతో ఆక్సీజన్ అమ్మే ఒక దుకాణం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. మీరు వింటున్న‌ది నిజ‌మే. ఢిల్లీ పరిధిలోని సాకేత్ అనే ప్రాంతంలో ఆర్య వీరకుమార్ అనే ఒక వ్యక్తి  త‌న దుకాణంలో 15 నిమిషాలపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటే 299 రూపాయలు ఇవ్వాలట. పైగా ఈ స్వచ్ఛమైన ఆక్సిజన్ లో ఏడు రకాల ఫ్లేవర్లు కూడా దొరుకుతాయిట.  


గాలిలోని నైట్రోజన్ తొలగించడం ద్వారా ఆక్సి ప్యూర్ బార్ లో 95 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోవచ్చని ఈ వ్యాపారవేత్త కొత్త వ్యాపారానికి తెర తీశాడు. ప్ర‌కృతి ప్రసాదించిన స్వచ్ఛమైన గాలిని కల్తీ చేసి వంద‌లు పెట్టి కొనుక్కోవ‌ల‌సి రావ‌టం దౌర్భాగ్యంగానే చెప్పాలి. ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు త‌ల‌పెట్టే మ‌నిషి త‌న కార్య‌క్ర‌మాల‌ను నిలువ‌రించ‌క‌పోతే ఇప్పుడు మంచినీళ్లు వెంట‌పెట్టుకుని తిరుగుతున్న‌ట్టే  మ‌రి కొద్ది సంవత్సరాలలో జనాలు స్వచ్ఛమైన గాలిని కూడా సీసాల్లో నింపుకొని తిరిగే ప‌రిస్థితి వ‌స్తుంద‌నిపిస్తోంది. మరి ఈ గాలి వ్యాపారం త్వరలో హైదరాబాద్ లో వస్తుంది. అందుకే జరా జాగ్రత్త.. మీరు పొల్యూట్ చేసే మీ పిల్లలు చెల్లించుకోవాల్సి వస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: