ప్రజలకు ఏదైన కష్టం వస్తే పోలీస్ స్టేషన్‌కు వెళ్లుతారు. కాని పోలీస్ డిపార్ట్‌మెంట్ వారికి కష్టం వస్తే వారి బాధను ఎవరికి చెప్పుకుంటారు. వారిపైన ఉన్న అధికారులకు చెప్పుకుంటారు. కాని ఇక్కడ ప్రశ్న అదికాదు దానికి సమాధానం కూడ ఇది కాదు. చట్టాన్ని రక్షిస్తున్న మహిళ పోలీసులనే ఆచట్టం కాపాడలేకపోతుంది. ఇక సామాన్యుల పరిస్దితి ఏంటి. ఇప్పటికే అన్ని చోట్ల మానభంగాలు, హత్యలతో అల్లకల్లోలాలు జరుగుతుంటే, ఇప్పుడు పోలీసు ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలు కూడా అత్యాచారాలకు గురవుతున్నారు.


ఇకపోతే మధ్యప్రదేశ్ లోని  విదిషా జిల్లాలో నజీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ కానిస్టేబుల్‌పై తోటి కానిస్టేబుల్ అత్యాచారం చేసాడన్న విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంటే ఆరు నెలల తరువాత ఈ ఘటన వెలుగు చూసింది.. ఇక నజీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ ఒకరోజు సాయంత్రం తన ఉద్యోగాన్ని పూర్తిచేసుకుని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లుతున్న సమయంలో, మార్గ మధ్యలో ఆమెతో ఉద్యోగం చేస్తున్న ఆనంద్ గౌతమ్ అనే తోటి కానిస్టేబుల్ బైక్ పై  ఇంటిదగ్గర దిగబెడతానని చెప్పి, బండి ఎక్కించుకుని ఆ మహిళ కానిస్టేబుల్ ఇంటికి తీసుకెళ్లుతూ ఆమెను మాటల్లో పెట్టి ఓ హోటల్  తీసుకెళ్లాడు.


అక్కడ ఆమెకు కూల్ డ్రింక్‌లో మత్తు మందుకలిపి ఇచ్చాడు. ఆ డ్రింక్ తాగిన ఆమె కాసేపటికి స్పృహ కోల్పోవడంతో ఆమెపై అత్యాచారం చేసి వీడియో తీశాడు. ఆ తర్వాత రోజు నుండి తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని లేకపోతే వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించ సాగాడు.


రోజు రోజుకు అతని వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ కానిస్టేబుల్ స్థానిక ఎస్‌పికి  ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడట. ఇకపోతే ఈ సంఘటన జూన్ 15న జరుగగా ఇన్ని నెలలకు వెలుగులోకి వచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: