హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో నర్సు నిర్మల ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్నా ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందని నర్సులు మండిపడ్డారు. అర్హత లేని వారికి ప్రమోషన్లు ఇస్తున్నారని నర్సులు ఆందోళన వ్యక్తం చేశారు. నిమ్స్ స్టోర్స్ లో పని చేసే నిర్మల అనే మహిళ అడ్మినిస్టేటివ్ డిపార్టుమెంట్ లో పని చేయాలని కోర్సులు పూర్తి చేసినా ఆమెకు ప్రమోషన్ దక్కలేదు. 
 
మరోవైపు అర్హత లేని వ్యక్తులకు మాత్రం ప్రమోషన్స్ ఇచ్చారు. ప్రమోషన్ విషయంలో అన్యాయం జరగటంతో నర్సు నిర్మల బలవన్మరణానికి ప్రయత్నించగా తోటి నర్సులు ఆమెను చికిత్స కొరకు తరలించారు. నిర్మల భర్త ప్రమోషన్ విషయంలో కొందరు నిర్మలను బెదిరించారని అందువలన నిర్మల బలవన్మరణానికి పాల్పడిందని చెబుతున్నాడు. నిమ్స్ వైద్యులు ప్రస్తుతం నర్సు నిర్మల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు. 
 
తమ డిమాండ్లను పరిష్కరించాలని నిమ్స్ నర్సులు ఆందోళనకు దిగారు. నిమ్స్ డైరెక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని సూపరిండెంట్ ను విధుల నుండి బహిష్కరించాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్యశాఖ ఈ విషయంపై స్పందించాలని నర్సులు కోరుతున్నారు. నర్సు నిర్మలకు చదువు ఉందని, అనుభవం ఉందని గతంలోనే అసిస్టెంట్ మేనేజర్ కు ఇంటర్వ్యూలు జరిగిన సమయంలో నిమ్స్ డైరెక్టర్ ఫోన్ కాల్ లో బెదిరించి నిర్మలను ఇంటర్వ్యూకు రాకుండా చేశారని నిమ్స్ సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారు. 
 
అర్హత లేని, అనుభవం లేని వాళ్లకు ప్రస్తుతం డిప్యూటీ మేనేజర్లుగా ప్రమోషన్ ఇచ్చారని ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ తనకు ఇవ్వమని నర్సు నిర్మల కోరినా ఆమెకు ఇవ్వకపోవటంతో ఆవేదన చెంది బలవన్మరణానికి పాల్పడిందని తెలుస్తోంది. నిర్మల భర్త మాత్రం తన భార్యను టార్చర్ చేయటం వలనే ఇంత ఘోరం జరిగిందని చెబుతున్నాడు. నిమ్స్ లో ప్రమోషన్ల పంచాయతీ ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది, 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: