తల్లిదండ్రులు తర్వాత అత్యంతగా గౌరవించేది పాఠాలు బోధించే మాస్టర్లనే. ఒక విద్యార్ధి భవిష్యత్తు బాగుపడాలన్న, చెడిపోవాలన్నా వారికి పునాది లాంటి వారు అధ్యాపకులు. అంతగా గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ, సంస్కారాన్ని నేర్పించే నోటితోనే సంస్కారహీనులుగా మారి ఆడపిల్లలను వేధిస్తున్నారు. ఇకపోతే ఉత్తరాఖండ్‌‌లోని జీబీ పంత్ యూనివర్సిటీలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.


బాధ్యతాయుతమైన అధ్యాపక వృత్తిలో ఉన్న ఓ ప్రబుద్ధుడు అర్ధరాత్రి పూట విద్యార్థినికి ఫోన్ చేసి మా ఆవిడ ఇంట్లో లేదు.. వచ్చి వంట చేసి పెట్టు అని ఆర్డర్ వేశాడట. ప్రొఫెసర్ మాటలకు నిర్ఘాంతపోయిన సదరు విద్యార్థిని వైస్ ఛాన్స‌లర్‌కు ఫిర్యాదు చేయగా మౌసుగు వేసుకున్న సదరు అధ్యాపకుడి బాగోతం బయటకు వచ్చింది. ఇకపోతే కూతురి వయసున్న తనకు రాత్రి సమయంలో సదరు ప్రొఫెసర్ పదే పదే ఫోన్ చేస్తూ మానసికంగా వేధించేవారని వీసీకి ఫిర్యాదు చేసింది.


అంతే కాకుండా రాత్రి పూట చెప్పరాని తీరుగా మెసేజ్‌లు పెడుతూ, కాల్ చేసి నువ్వు నా రూం కు వచ్చేయ్ అంటూ అసభ్యంగా మాట్లాడాడని విద్యార్థిని విలపించింది. బాధితురాలు ఇంతగా రోదిస్తున్నా కానీ యూనివర్సిటీ కమిటీ మాత్రం ఇప్పటి వరకూ ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదట. వీరి ప్రవర్తనతో విసిగిపోయిన సదరు విద్యార్ధిని ఆందోళన చేపట్టడంతో.. వ్యవహారం గవర్నర్ దృష్టికి వెళ్లింది.


ఈ వ్యవహారంపై ఆమె సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధ్యుడైన ప్రొఫెసరుపై కఠిన చర్యలు తీసుకోవాలని వీసీని ఆదేశించారట.. సమాజంలో అన్ని చోట్ల ఇలాంటి ఛీడపురుగులు తయారవుతున్నారు. ఆడపిల్లను కనాలంటే ఎంతగా బాధపడుతున్నారో, అంతె బాధను ఆమెను నలుగురిలోకి పంపాలన్నా చివరికి దేవాలయం లాంటి యూనివర్శిటీలకు పంపించి చదివించాలన్నా తల్లిదండ్రులు అంతే వేధన చెందుతున్నారు. ఇలాంటి కీచకులు సమాజంలో ఉంటే నవసమాజ నిర్మాణం ఏం జరుగుతుంది. ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: