టిడిపి పార్టీలో కీలక నేతైనా  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  గత కొన్ని రోజులుగా టీడీపీ పార్టీపై అధినేత చంద్రబాబు నారా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై టిడిపి నేతలు మాత్రం తప్పుబడుతున్నారు . అయితే తాజాగా పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్యేలతో  భేటీ అయిన చంద్రబాబు నాయుడు వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి పార్టీ నుంచి వంశీ ని  సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుండి జూనియర్ ఎన్టీఆర్ ను నారా లోకేష్ పోలుస్తూ లోకేష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. 



 వల్లభనేని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండి పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వల్లభనేని వంశీ ఘాటుగా సమాధానమిచ్చారు. నేను చెప్పిన దాంట్లో తప్పేముంది అంటూ  టిడిపి నేతలను వంశి ప్రశ్నించారు . లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ కు  పోలిక ఎక్కడుంది... నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటూ వాఖ్యానించారు వల్లభనేని వంశీ. నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఒకచోట నిలబడితే నలుగురు ఎన్టీఆర్ దగ్గరకు వస్తారా నారా లోకేష్ కి దగ్గరకీ వస్తారా  అంటూ ప్రశ్నించారు. వర్ధంతికి జయంతికి కూడా తేడా తెలియని  నారా లోకేష్ అసలు ఏం మాట్లాడగలుగుతాడు అంటూ ప్రశ్నించారు.



 నారా లోకేష్ ను బలవంతంగా చంద్రబాబునాయుడు గారు రుద్దటానికి  ప్రయత్నాలు చేస్తున్నారు... లోకేష్ ను తన ఇంట్లో రుద్దగలడు... చంద్రబాబు ఆస్తులన్నీ లోకేష్ ఇవ్వగలిగాడు... ఆ పాలు పెరుగు కంపెనీలు కూడా చంద్రబాబు లోకేష్ కి కట్టబెట్టగలడు   కానీ పార్టీ నేతల మీద ప్రజల మీద లోకేషన్ ఏం రుద్దగలడు   అంటూ విమర్శలు గుప్పించారు  వల్లభనేని వంశీ. అయితే   వంశీ ఇప్పటికే వైసీపీ లోకి వచ్చిందుకు  లైన్ క్లియర్ కావడంతో ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. వంశీ వ్యాఖ్యలపై వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో దానిపై స్పందించిన వల్లభనేని వంశీ చంద్రబాబు నన్ను సస్పెండ్ చేయడం ఏంటి  ముందు తన పరిస్థితి ఏంటో చూసుకోవాలంటూ  వ్యాఖ్యానించారు వంశీ .


మరింత సమాచారం తెలుసుకోండి: