మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.  మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు కలిసి త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.  త్వరలోనే దానికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు.  ప్రస్తుతం మూడు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని, మూడు పార్టీలు కలిసి త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే చర్చలు జరుగుతున్నాయి.  


రేపు మహా గవర్నర్ భగత్ సింగ్ ను కలవబోతున్నారు.  భగత్ సింగ్ ను కలిసి మహా రైతుల గురించి మాట్లాడబోతున్నారు. రైతుల సమస్యలపై  చర్చించేందుకు కొంత సమయం కావాలని కోరారు. ఇక త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ఆరునెలలు కాదు, ఐదేళ్ల సమయం పాటు తప్పకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని పవార్ అంటున్నారు.  జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే.. శివసేన బీజేపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుందేమో అనిపిస్తోంది.  


31 సంవత్సరాలు కలిసి ఉన్న పార్టీ ముఖ్యమంత్రి కోసం బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. ఇలా తెగతెంపులు చేసుకొని కాంగ్రెస్ వైపుకు అడుగులు వేసింది.  ఎన్సీపీపై పూర్తి భరోసాతో ఉన్నది శివసేన. విషయం ఏమిటంటే.. శివసేన ఎన్సీపీకి ఎంతమేరకు సపోర్ట్ గా ఉంటుంది.  ఎన్నాళ్ళు కలిసి కాపురం చేస్తుంది అన్నది తెలియాలి.  31 సంవత్సరాలు కలిసున్న పార్టీనే కాదని వెళ్ళిపోయినా శివసేన కొత్తగా కాపురం చేసే ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ఉంటుందా చూడాలి.  


ఎన్సీపీ, కాంగ్రెస్ తో శివసేన కలిస్తే.. శివసేన కు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు.  పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు.  అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన సమయం దొరుకుతుంది అనుకోవడం లేదు.  బీజేపీ చెప్పినట్టుగా మరో ఆరునెలల్లో తప్పకుండా మరలా ఎన్నికలు వస్తాయి అనడంలో సందేహం అవసరం లేదు.  చూద్దాం ఏం జరుగుతుందో.  ఎలా అడుగులు వేస్తుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: