తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్ లో చలి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అవుతున్నాయి. ఇక హైదరాబాద్ లోనూ రోజురోజుకి కనిష్ట  ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి దెబ్బకు తెల్లారితే కానీ జనం బయటకు రావడానికి జంకుతున్నారు. 


తెలంగాణలో చలిపులి వణికిస్తోంది. ప్రత్యేకించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డుస్థాయికి పడిపోయాయి.కనిష్ట ఉష్టోగ్రతలు దారుణంగా పడిపోయాయి. 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. చలి, మంచుతో ఉదయం పదీ, పదకొండు గంటల దాకా జనం బయటకు రాలేని పరిస్థితి. నిత్యం వాకింగ్ తో రద్దీ గా ఉండే ఏరియాల్లోనూ జనం కనిపించడం లేదు. 


రాజధాని హైదరాబాద్ వాసులను చలి..పులి చంపేస్తుంది. సాయంత్రం 5గంటల నుంచే పలు ప్రాంతాల్లో చలిగాలులు వీస్తుండడంతో వాహనదారులు, పాదాచారులు వణికిపోతున్నారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు మంచు కురుస్తోంది. నగర పరిధిలోని హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి శివారు ప్రాంతాల్లో తెల్లవారు జామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.  


ఉదయం పూట మార్నింగ్ వాకింగ్‌కు, ఇతర పనులకు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. అత్యవసర పనులైతే తప్ప ఇంటి నుంచి కాలు బయటపెట్టడంలేదు. చలితీవ్రత, పొగమంచు కారణంగా రోడ్లు సరిగా కనపడక ఇబ్బందులు పడుతున్నామని పలువురు వాహనదారులు వాపోతున్నారు. నవంబర్ రెండోవారంలో చలి పంజా విసురుతుంటే, రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలలోని గ్రామాల్లో అయితే ప్రజలు మంటలు వేసుకుంటూ చలి పంజా నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరికొందరు స్వెటర్లు కప్పుకొని వణుకు నుంచి రక్షించుకోగా.. మరికొందరు సూర్యోదయం అయిన తర్వాతే తప్ప అంతకు ముందు ఇళ్లనుంచి బయటికి రావడమే మానేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: