నగిరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా సెల్వమణి అటు  రాజకీయాల్లో.. ఇటు జబర్దస్త్ జడ్జ్  గా కూడా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఎన్నికల్లో రెండో సారి ఎమ్మెల్యే గా గెలిచిన రోజా సెల్వమణి ప్రతిపక్షాల పై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఉంటుంది. అయితే నగరి ఎమ్మెల్యే ఏపీ ఐ ఐ సి చైర్మన్ రోజా... తన నియోజకవర్గమైన నగరీ  నియోజకవర్గాన్ని   ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు  ముందుకు సాగుతున్నారు. ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు వినూత్న ఆలోచన చేశారు ఎమ్మెల్యే రోజా. 



 నగరి నియోజకవర్గంలోని అన్ని వార్థులు  పంచాయతీలు శుభ్రంగా ఉంచాలంటూ నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు . ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ ను నివారించేందుకు ఆలోచన చేస్తున్నారు రోజా... నియోజకవర్గ ప్రజలందరికీ ఒక మంచి ఆఫర్ అని ప్రకటించారు. ఎవరైతే ప్లాస్టిక్ ను తీసుకువచ్చి ఇస్తారో  వారికి బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు ఎమ్మెల్యే రోజా. ఒక కేజీ ప్లాస్టిక్ తీసుకొస్తే  ఒక కేజీ బియ్యం ఇస్తానని రోజా తెలిపారు. తాజాగా నగరి నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే రోజా ఈ సందర్భంగా పలుచోట్ల ప్లాస్టిక్ వ్యర్ధాలను చూసి వెంటనే ఈ ప్రకటన చేశారు. నగిరి నియోజకవర్గానికి ప్లాస్టిక్ రహిత వార్డులు  పంచాయతీలుగా నిర్మిస్తామని ప్రజలకు పిలుపునిచ్చారు. 



 నో ప్లాస్టిక్ న్యూ నగరీ  అనే అందరూ అభినందించేలా చేద్దామంటూ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే రోజ . తన పుట్టినరోజు నవంబర్ 17 నుంచి సీఎం జగన్ పుట్టినరోజు డిసెంబర్ 21 వరకు 40 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు రోజా . ఇదిలా ఉండగా అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశాన్ని ప్లాస్టిక్ రహితంగా చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులు కూడా తమ ప్రాంతాల్లో ప్లాస్టిక్ నివారించేందుకు వినూత్న ఆలోచనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: