జేసి దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.  గత కొన్ని రోజులుగా జేసి దివాకర్ రెడ్డి ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు దాడులు చేస్తూ.. బస్సులను సీజ్ చేస్తున్నారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో బస్సులను సీజ్ చేయడంతో జెసి ట్రావెల్స్ విలవిల్లాడుతున్నది. కావాలనే ప్రభుత్వం ఇలా చేస్తున్నట్టు జెసి పేర్కొంటున్నారు.  


తన ట్రావెల్స్ పై దాడులు చేస్తూ తమను మానసికంగా దెబ్బ తీసేందుకు, ఆర్ధికంగా ఇబ్బందులు పెట్టేందుకు జెసి ప్రయత్నం చేస్తున్నారని వాదిస్తున్నారు.  అయితే, ఎవరిని తమ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టదని చట్టం తన పనిని తానూ చేసుకుంటూ పోతుందని, చట్టం ముందు అందరూ సమానమే అని వైఎస్ జగన్ చెప్పడం విశేషం.  ఇలా తనను మానసికంగా ఇబ్బంది పెట్టె బదులుగా నాలుగు రోజులు జైల్లో పెట్టినా ఇబ్బంది లేదని అంటున్నారు జేసి.  


అధికారులు బస్సులను సీజ్ చేస్తుంటే వారిపై దివాకర్ ట్రావెల్స్ కేసులు పెట్టింది.  అయితే, దీనికి తమకు ఎలాంటి ప్రమేయం లేదని, పైనుంచి వత్తిళ్లు కారణంగానే ఇలా చేస్తున్నట్టు అధికారులు చెప్పినట్టుగా తెలుస్తోంది.  ఈ గొడవ ఎందుకులే అని చెప్పి దివాకర్ ట్రావెల్స్ ను కొన్నాళ్ళపాటు నడపకుండా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.  కొంతకాలం సైలెంట్ గా ఉంటె అన్ని సర్దుకుంటాయని జెసి భావిస్తున్నారు.  


పార్టీలో చేరాలని ఆయనపై ఒత్తిళ్లు వచ్చిన మాట వాస్తవమే.  కానీ, జెసి దివాకర్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.  ఇలా దూరంగా ఉండటానికి కారణాలు ఉన్నాయి.  రాజకీయంగా ఇప్పుడు ఎలాంటి బలం లేని కారణంగా అయన దూరంగా ఉండాలని అనుకున్నారట. టీడీపీలో ఉన్నా, ఆ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. ఒక్క టిడిపితోనే కాకుండా ఆయన ఏ పార్టీతో కూడా సంప్రదింపులు జరపడంలేదు.  మరి చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: