ఓడిపోయామనో బాధో...వయసు మీద పడుతున్న ప్రభావమో తెలియదు గానీ...ఈ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా ఫ్రస్టేషన్ పెరిగిపోతుంది. అందుకే ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి కొత్త ప్రభుత్వానికి కొంచెం కూడా సమయం కూడా ఇవ్వకుండా విమర్శలు చేసేస్తున్నారు. సరే తమ రాజకీయ ప్రత్యర్ధి కాబట్టి వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చు. 


కానీ బాబు ప్రజల మీద కూడా బాగా ఫ్రస్టేట్ అవుతున్నట్లు కనబడుతుంది. ఓడిన దగ్గర నుంచి ఏదొక ప్రెస్ మీట్లో ప్రజల మీద కామెంట్లు చేస్తున్నారు. జగన్‌ను గెలిపించి అనుభవిస్తున్నారని, తాను ఉంటే రాష్ట్రం ఉంటే బాగుండేదని కానీ మీరు తప్పు చేశారని పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తాజాగా ఇసుక దీక్షలో కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీక్ష విఫలమైందని అర్ధమైపోయి ప్రజలని తప్పుబట్టడం చేశారు. 


దీక్షకు పెద్దగా భవననిర్మాణ కార్మికులు హాజరుకాకపోవడంతో ఫ్రస్టేషన్ పెంచేసుకున్నారు. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది కార్మికులు ఉంటే 200 మంది కూడా దీక్షకు రాలేదని అన్నారు. అలాగే మీకోసం నేనే పోరాటం చేయాలా? మీరు చేయరా? అంటూ ప్రజలన్నే ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంపై పోరాటానికి ప్రజల మద్ధతు దొరకకపోవడంతో వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఎన్నికల ముందు కూడా బాబు ఇలాగే మాట్లాడారు. 


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ధర్మపోరాట దీక్షలు చేస్తూ బాగా ఫ్రస్టేట్ అయ్యారు. బీజేపీ ఏమన్నా కేసులు పెట్టడానికి చూస్తే ప్రజలే తనకు అండగా నిలవాలని, తనని రక్షించుకోవాలని మాట్లాడారు. ఇక ఇలా మాట్లాడాక ఎన్నికల్లో బాబు పరిస్తితి ఏమైందో అందరికీ తెలిసిందే. అలాగే వైసీపీ ప్రభుత్వం పట్ల పాజిటివ్ గా ఉన్న ప్రజలపై ఫ్రస్టేట్ అయితే ఏమవుతుందో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: