కృష్ణా జిల్లా టీడీపీ అనగానే గుర్తొచ్చేది...ఇక్కడి కమ్మ సామాజికవర్గ నేతలే. పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా కమ్మ సామాజికవర్గం టీడీపీకి మద్ధతుగా నిలుస్తూ వస్తుంది. జిల్లాలో వీరిదే ఆధిపత్యం ఎక్కువ ఓడినా...గెలిచినా నేతలు హవా బాగానే ఉంటుంది. అయితే ఈ హవాని తగ్గించేందుకు దివంగత వైఎస్ గట్టిగానే ప్రయత్నాలు చేశారు గానీ...పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం జగన్ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నట్లు కనబడుతోంది. 


ఈ ప్రాసెస్ లో జిల్లా కమ్మ నేతలు బాబుకు గట్టిగా దెబ్బ వేస్తున్నారు. అధికారం కోల్పోవడం, పార్టీకి భవిష్యత్ కూడా ఉండేలా కనిపించకపోవడంతో నేతలు వరుసగా వైసీపీలోకి క్యూ కట్టేస్తున్నారు. అది కూడా బడా నేతలు బాబుకు షాక్ ఇస్తున్నారు. తాజాగా విజయవాడలో పట్టున్న యువనాయకుడు దేవినేని అవినాష్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. అటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒక మెట్టు పైకి వెళ్ళి మరి బాబుని చెడామడా తిట్టేసి జగన్ కు మద్ధతు ఇస్తున్నాని చెప్పేశారు. 


ఇక వీరిద్దరి బాటలో మరికొందరు కమ్మ నేతలు కూడా వైసీపీలోకి వెళ్ళుతున్నారని తెలిసింది. విజయవాడలో పేరున్న కాట్రగడ్డ బాబు, మరికొందరు మాజీ కార్పొరేటర్లు బాబుకు షాక్ ఇస్తారని తెలుస్తోంది. అయితే ఎన్నికల ముందు వసంత కృష్ణప్రసాద్, యలమంచి రవి, దాసరి బాలవర్ధనరావు, దాసరి రమేశ్, మాజీ మంత్రి దేవినేని ఉమా సోదరుడు చంద్ర శేఖర్ లు బాబుకు షాక్ ఇచ్చి వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. 


ఇందులో వసంత మాజీ మంత్రి దేవినేని ఉమా మీద గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఎన్నికల తర్వాత కైకలూరు, గుడివాడ నియోజకవర్గాల్లో కొద్దిగా పేరున్న డాక్టర్ సి‌ఎల్ వెంకట్రావు టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. మరి రానున్న రోజుల్లో కృష్ణా ఎంతమంది కమ్మ నేతలు బాబుకు దెబ్బవేస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: