తెలుగుదేశం పార్టీ నేత‌కు జైలు నుంచి విముక్తి ల‌భించ‌నుంది. ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ విప్ చింతమనేని ప్రభాకర్‌కు కి బెయిల్ మంజూరు అయింది. ఇప్పటికే నాలుగు కేసుల్లో జైలులో ఉన్న ప్రభాకర్‌కు...అన్ని కేసుల్లోనూ..ఉప‌శ‌మ‌నం ద‌క్కింది. కోర్టు నాలుగు కేసుల్లో బెయిల్ మంజూరు చేసిన నేప‌థ్యంలో...రేపు ఏలూరు సబ్ జైల్ నుండి చింతమనేని ప్రభాకర్ విడుదలయ్యే అవకాశం ఉంది. 


టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చింతమనేని ప్రభాకర్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు.. ఆయనపై దాదాపు 50 కి పైగా కేసులు నమోదయ్యాయి. కొన్నింటిలో బెయిల్ వచ్చినా మరికొన్ని కేసుల్లో బెయిల్ రాలేదు.. దాంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చింతమనేనితో పాటుగా...మరికొందరు అనుచరులపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో తమను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించారని చింతమనేనిపై కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పినకడిమికి చెందిన యువకులపై చింతమనేని దౌర్జన్యం చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో అజ్ఞాతంలో ఉన్న చింతమనేని భార్యకు అనారోగ్యంగా ఉండడంతో ఎస్పీ ఎదుట లొంగిపోవడానికి సిద్ధ‌మ‌వ‌గా...ఆయ‌న్ను పోలీసులు అరెస్టు చేశారు. 


తాను మళ్లీ ప్రజా పోరాటాలతో బయటకు వస్తుంటే..చూడలేక అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి కేసులకు భయపడేది లేదని ఇటీవలే వ్యాఖ్యానించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చింతమనేని ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే ఆస‌క్తి నెల‌కొంది. జైల్లో ఉన్న స‌మ‌యంలోనే....పెద్దఎత్తున కేసులు నమోదైన నేపథ్యంలో కార్యకర్తల్లో దైర్యం నింపడంకోసం 'మీ అరెస్టులు మమ్మల్ని భయపెట్టలేవు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోసం ఎంత దూరమైన వెళ్తాను, దేనికైనా తెగిస్తా..' అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు  చింతమనేని ప్రభాకర్ సెప్టెంబర్ 11న అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. 66 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఇటీవ‌లే టీడీపీ యువ‌నేత లోకేష్‌..చింత‌మ‌నేని కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: