బై బై బాబు.....ఈ నినాదం ఎన్నికల్లో ఎంత హైలైట్ అయిందో అందరికీ తెలుసు. జగన్, ఆయన సోదరి షర్మిళలు ఓ రేంజ్ లో ఈ నినాదం వాడగా, మిగిలిన వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా దీనిని ఫాలో అయ్యారు. ఇక ఎన్నికల్లో ప్రజలు కూడా ఈ నినాదం నిజం చేశారు. బాబుని ఓడించి మూలన పెట్టారు. జగన్ ని గెలిపించి సీఎం చేశారు. అయితే ఇక్కడితో ఈ నినాదం ముగిసిపోలేదు. మొన్నటివరకు దీన్ని ప్రత్యర్ద పార్టీ నేతలు వాడితే...ఇప్పుడు సొంత పార్టీ నేతలే వాడుతున్నారు.


ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గర నుంచి చాలామంది నేతలు ‘బై బై బాబు’ చెప్పేశారు. రాజ్యసభ సభ్యులతో సహ కీలక నేతలు వైసీపీ, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. ఇంకా నేతలు ఇదే పనిలో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైసీపీ తీర్ధం పుచ్చేసుకున్నారు. అటు టీడీపీకి రాజీనామా చేసి కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సడన్ గా పోలిటికల్ స్క్రీన్ పైకి వచ్చి బాబు అండ్ కొ పై తిట్ల బాణాలు వేసి బై బై బాబు అని చెప్పేశారు. 
అలాగే వంశీ మాటల ప్రకారం చూసుకుంటే టీడీపీలో చాలామంది నేతలు అధినేత చంద్రబాబు పట్ల అసంతృప్తిగా ఉన్నారని అర్ధమవుతుంది.

టీడీపీలో తాజా పరిణామాలని గమనిస్తుంటే వారు కూడా త్వరలోనే బై బై చెప్పేస్తారని తెలుస్తోంది. పైగా వైసీపీ, బీజేపీ నేతలు పోటీ పడి మరి టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని, త్వరలోనే బాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోనుందని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీకి వెళ్లనున్నారని తెలుస్తోంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఎంతమంది టీడీపీ నేతలు బై బై బాబు అంటారో?


మరింత సమాచారం తెలుసుకోండి: