టిడిపి నేత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వాక్యాలు ప్రస్తుత ఆంధ్రా రాజకీయాల్లో  హాట్ టాపిక్ గా మారాయి . గత కొన్ని రోజుల క్రితం టిడిపి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి  సంచలనం సృష్టించిన వల్లభనేని వంశీ...  తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ నారా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ వైపు జగన్ ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే  మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. నారా లోకేష్ ను కూడా ఎన్టీఆర్ తో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు వంశీ . అయితే వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబుపై చేస్తున్న వ్యాఖ్యలను  తప్పుబడుతున్నారు. 



 తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై టీడీపీ సీనియర్ నేతలు ఎమ్మెల్యేలతో కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వంశీ విమర్శలపై అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. టీడీపీ  నుండి వంశీని సస్పెండ్ చేస్తున్నామని తేల్చి  చెప్పారు. అయితే దీనిపై స్పందించిన వల్లభనేని వంశీ చంద్రబాబు పై ఘాటు విమర్శలు గుప్పించారు. టీడీపీ  పార్టీకి తాను రాజీనామా చేస్తానని చెప్పాను  ఇక చంద్రబాబు నన్ను టీడీపీ  నుంచి సస్పెండ్ చేయడం ఏంటి అంటూ ఎద్దేవా చేశారు. అయితే టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేయడం కాదు చంద్రబాబు నాయుడు దమ్ముంటే బీజేపీలో చేరిన తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను రాజీనామా చేయించాలని వల్లభనేని వంశీ చంద్రబాబు కు సవాల్ విసిరారు. 



 తాజాగా మీడియాతో మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బీజేపీలో నలుగురు టీడీపీ ఎంపీలు చేరడాన్ని నిరసిస్తూ చంద్రబాబుకు దీక్ష చేపట్టే దమ్ముందా... టిడిపి అధినేత నిజంగా నిజాయితీపరుడు అయితే దమ్ముంటే వారితో రాజీనామా చేయించాలని వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. మోడీ  అమిత్ షా ల దగ్గరికి వెళ్లి మా  పార్టీ ఎంపీలు బీజేపీలో చేరారు వారితో రాజీనామా చేయించాలని అడగాలని సూచించారు. అయితే టీడీపీలో ఇంకా ఇబ్బంది పడే ఎమ్మెల్యేలు ఉన్నారా అన్న ప్రశ్నకు బదులు ఇచ్చిన వల్లభనేని వంశీ... ఈ విషయంపై తాను కామెంట్ చేయడం బాగుండదని సమయం వచ్చినప్పుడు విషయం అందరికీ తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: