నేడు   ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసిపి ఎంపీలతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ నెల 18 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ ఎంపీలతో మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి. పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ తరపున తమ పార్టీ ఎంపీలు ప్రస్తావించాల్సిన  అంశాలపై ఆయన ఈ సమావేశంలో చర్చించారు. అయితే ఈ సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. 


 అయితే ఈ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ మిథున్ కుమార్  సమావేశంలో చర్చించుకున్న విషయాలు వెల్లడించారు. శీతాకాల సమావేశాల్లో  పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్  ఎంపీలకు సూచించినట్లు ఆయన తెలిపారు . సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం నిధులపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారని తెలిపారు . అంతేకాకుండా పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలను ప్రస్తావించాలని ఆదేశించినట్లు  ఆయన తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్లో మెట్రో కారిడార్ అంశాన్ని కూడా కేంద్రంతో చర్చించాలని జగన్ సూచించినట్లు ఆయన తెలిపారు. 



 కడప స్టీల్ పరిశ్రమ అంశాన్ని కూడా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో  ప్రస్తావించాలని జగన్ ఆదేశించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా సెంట్రల్ యూనివర్సిటీ ఫండ్స్ పై కూడా వైసీపీ ఎంపీలు  కేంద్రంతో చర్చించాలని  జగన్ సూచించారు. ఇక రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కేటాయింపు పై కూడా పార్లమెంటు సమావేశాల్లో  వైసీపీ ఎంపీలు చర్చించాలంటూ జగన్  సూచించారని తెలిపారు . వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు గురించి కూడా లేవనెత్తుతామని తెలిపారు.అయితే ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లుగానే తాను కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని ఎంపీ మిథున్ కుమార్ తెలిపారు


మరింత సమాచారం తెలుసుకోండి: