తెలుగు దేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు అండ్ కో కు పంట్లో రాయిలా, కంట్లో నలుసుగా మారిన సంగతి విధితమే. తనకు ఎవరైనా ఏమైనా అంటే వారి జాతకాలు మొత్తం బయటపెడతాను అంటూ వంశీ హెచ్చరించడంతో ఇపుడు టీడీపీ పెద్దలకు కాళ్ళూ చేతులు ఆడడంలేదంటున్నారు. వంశీ చాలా అగ్రెసివ్ గా మీడియా సమావేశాల్లో  సైతం మొత్తం టీడీపీ గుట్టు విప్పేస్తున్నారు. ఇది నిజంగా టీడీపీకి 23 సీట్లు వచ్చిన దాని కంటే ఘోర అవమానంగా చెప్పుకోవాలంటున్నారు.


టీడీపీకి అసలైన గుదిబండ లోకేష్ అంటూ బాబు అతని వెయిట్ టీడీపీ నావ మోయలేదని, అది మునిగిపోవడం ఖాయమని కూడా జోస్యం చెప్పేశారు. ఇక చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం వెన్నుపోట్ల మయం అంటూ విరుచుకుపడిన వంశీ నాడు తొలిసారి సీటు ఇచ్చిన ఇందిరమ్మను, తరువాత ఆదరించి పార్టీలో పెద్ద పీట వేసిన ఎన్టీయార్ ని కూడా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. అదే సమయంలో బీజేపీతో 1999 ఎన్నికల్లో  పొత్తు పెట్టుకుని గెలిచి 2004 ఎన్నికల నాటికి ఆ పార్టీతో పొత్తు చారిత్రాత్మక తప్పిదం అన్నది బాబేనని, తిరిగి 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని 2018 ఎన్నికల నాటికి మోడీ, అమిత్ షాలను దారుణంగా  విమర్శించినది కూడా బాబేనని అన్నారు.


ఇక ఇపుడు ఓడిన తరువాత మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి బాబు ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా వంశీ ఇపుడు బయటకు వచ్చినా కూడా చంద్రబాబు మీద ఒక వ్యూహం ప్రకారం పని చేస్తున్నారని అంటున్నారు. టీడీపీలో మరో నలుగురు అయిదుగురు ఎమ్మెల్యేలను కలుపుకుని బయటకు రావాలన్నది వంశీ ఆలోచనగా ఉంది. అలా పధకాన్ని అమలు చేసి బాబుని ఏపీ అసెంబ్లీలో వ‌ట్టి ఎమ్మెల్యేగా చేయాలని, ప్రతిపక్ష హోదాని లేకుండా చూడాలని వంశీ ఒక భారీ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి పెట్టుకున్నారని అంటున్నారు. అదే జరిగితే మాత్రం బాబు కు విపక్ష హోదా కూడా గోవిందా అవుతుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: