ఈనెల 11వ తేదీన ఐటి శాఖ చేసిన ఓ ప్రకటన ఏపిలో ఎంతటి సంచలనంగా మారిందో అందరకి తెలిసిందే. ఓ ప్రముఖ కంపెనీ నుండి ఓ ముఖ్యమైన నేత రూ. 150 కోట్ల ముడుపులు అందుకున్నాడని ఉన్నతాధికారి ప్రకటించారు. ఇచ్చిందెవరు ? పుచ్చుకున్నదెవరు ? అనే విషయంలో తమ దగ్గర పూర్తి ఆధారాలున్నట్లుగా చెప్పటంతో  కలకలం రేగింది. ఇపుడా అంశం మీదే తొందరలోనే ఐటి శాఖ విచారణ చేపట్టబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంతో ముఖ్యనేతలో టెన్షన్ పెరిగిపోతోందని సమాచారం.

 

ముడుపులిచ్చిన కంపెనీ ప్రధాన కార్యాలయం ముంబాయ్ లో ఉందట. సదరు కంపెని అమరావతిలో జరిగిన నిర్మాణాల్లో ప్రముఖ పాత్ర పోషించిందనే ప్రచారం జరుగుతోంది. రూ. 2652 కోట్ల విలువైన పనులు ఇచ్చినందుకే సదరు కంపెనీ ముఖ్యనేతకు 150 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించిందట.

 

సిఆర్డీఏ పరిధిలో మొదలైన వేలాది కోట్ల రూపాయలు విలువైన అనేక ప్రాజెక్టుల్లో కూడా సదరు కంపెనీకి మేజర్   భాగస్వామ్యం  ఉన్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. కాంట్రాక్టు పనులు దక్కక మునుపే 20 శాతం ముడుపులు ఇచ్చే విధంగా ముందే కాంట్రాక్టు కుదుర్చుకున్నారట ముఖ్యనేత. ఒప్పందం కుదిరిన తర్వాత ఆ కంపెనీకి రూ. 700 కోట్ల విలువైన పనులు ఒకేసారి దక్కిందట.

 

 

దక్షిణభారత దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈనెల 11వ తేదీన ఐటి శాఖ జరిపిన దాడుల్లో ఈ కీలక సంబంధించిన పూర్తి ఆధారాలు దొరికినట్లు సదరు ఉన్నతాధికారి చెప్పిన తర్వాత సంచలనం మొదలైంది. పైగా ఆ వ్యవహారం అంతా 2014-19 మధ్య కాలానికి చెందినదిగా చెప్పటంతో ముఖ్యనేత ఎవరు ? అనే విషయంలో ఊహాగానాలు పెరిగిపోతున్నాయి.

 

పైగా ఈ మొత్తాన్ని హవాలా రూపంలో విదేశాలకు తరలించే ప్రయత్నం కూడా చేశారని చెప్పటంతో మరింత సంచలనమైంది.  ఆధారాలన్నీ బిజెపి ముఖ్యనేతల చేతుల్లో పడిందని  తెలిసిన దగ్గర నుండి సదరు ముఖ్యనేతకు చెమటలు మొదలయ్యాయట. ఇదే విషయమై తొందరలోనే ఐటి శాఖ ఆధ్వర్యంలో విచారణ మొదలవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విచారణ మొదలైన తర్వాత ముఖ్యనేత ఎవరనే విషయంలో పూర్తి క్లారిటి వస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: