తెలుగుదేశంపార్టీలో గన్నవరం ఎంఎల్ఏగా రాజీనామా చేసిన వల్లభనేని వంశీ వివాదం బాగా రాజుకుంటోంది. నిజానికి పదిహేను రోజుల క్రితమే తాను టిడిపి ప్రధామిక సభ్యత్వంతో పాటు ఎంఎల్ఏగా కూడా రాజీనామా చేసినట్లు ఎంఎల్ఏ  ప్రకటించారు. సరే వంశీ ప్రకటనపై చంద్రబాబునాయుడు నుండి ఎటువంటి స్పందనా రాలేదు లేండి.

 

అయితే రెండు రోజుల క్రితం డైరెక్టుగా చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేస్తు వంశీ మాట్లాడేసరికి వివాదం తరస్ధాయికి చేరుకుంది. ఎంఎల్ఏకి షోకాజ్ నోటీసని, సస్పెన్షన్ వేటని విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నారు తమ్ముళ్ళు. ఎప్పుడో రాజీనామా చేసిన తనను ఇపుడు సస్పెండ్ చేయటమేంటంటూ వంశీ ఎదురుదాడి మొదలుపెట్టారు.

 

సరే ఈ విషయాలను పక్కనపెడితే వంశీ కేంద్రంగా టిడిపి నుండి నారా లోకేష్ తో సహా చాలామంది నేతలు ఒక్కసారిగా రెచ్చిపోతున్నారు. ఎంఎల్సీ రాజేంద్రప్రసాద్ –వంశీకి మధ్య  చర్చా కార్యక్రమం జరిగింది. అందులో ఎంఎల్సీని వంశీ ఓ ఆటాడుకున్నారు. మామూలుగా అయితే ప్రత్యర్ధులపై నోటికొచ్చినట్లు విరుచుకుపడటం ప్రసాద్ కు అలవాటు. అలాంటి ప్రసాద్ నే వంశీ నెరెత్తనీయకుండా నోటికొచ్చిన బూతులన్నీ వాడేశాడు.

 

 మధ్యాహ్నానికి నారా లోకేష్ కూడా మీడియాతో వంశీ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. తనపై ఎంఎల్ఏ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోవటానికి లోకేష్ నానా అవస్తలు పడ్డాడు. చివరకు లోకేష్ పరిస్ధితి ఎలాగయ్యిందంటే ఏడవలేక నవ్వు మొహం పెట్టినట్లయిపోయింది. ఇక మరో ఎంఎల్సీ బుద్ధా వెంకన్న అయితే మీడియాలో మాట్లాడలేక ట్విట్టర్లో మాత్రమే ఆరోపణలు చేయటం గమనార్హం.

 

రాజేంద్రప్రసాద్, లోకేష్ విషయంలో ఏం జరిగిందో చూసిన తర్వాత బుద్ధా వెంకన్న ముందు జాగ్రత్త పడినట్లే కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత టిడిపి తరపున ఇంకే నేత కూడా వంశీ గురించి మాట్లాడటానికి మీడియా ముందుకు రాలేదు. చివరకు కృష్ణా జిల్లాలోని నేతలు కూడా వంశీ గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదంటే చిచ్చు ఏ స్ధాయిలో రాజుకుందో అర్ధమైపోతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: